తెలంగాణలో భారీగాసేవా కార్యక్రమాలు ప్రకటించిన వీ-గార్డ్ 

తెలంగాణలో భారీగాసేవా కార్యక్రమాలు ప్రకటించిన వీ-గార్డ్ 

హైదరాబాద్​, వెలుగు: స్టెబిలైజర్లు, ఫ్యాన్ల వంటి ఎలక్ట్రిక్​ ప్రొడక్టులు తయారు చేసే వీ–గార్డ్​ 2026 ఆర్థిక సంవత్సరంలో  మనరాష్ట్రంలో కార్పొరేట్​సోషల్​ రెస్పాన్సిబిలిటీ (సీఎస్​ఆర్​) కార్యక్రమాలను పెద్ద ఎత్తున విస్తరించింది. విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాలలో కార్యక్రమాలను సంస్థ చేపట్టింది. 

నవదర్శన్ ప్రాజెక్ట్ కింద రంగారెడ్డి, నల్గొండ, సిద్దిపేట, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లోని 10 ప్రత్యేక పాఠశాలలకు చెందిన 958 మంది చిన్నారులకు వైద్యం, వృత్తి విద్యా శిక్షణ అందించింది. 

చర్లపల్లిలో ఈఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ డిస్పెన్సరీ నిర్మాణానికి మద్దతు ఇచ్చింది. 11 రాష్ట్రాల్లో సంస్థ 56 సీఎస్ఆర్ ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేసింది. ఇందుకోసం మొత్తం రూ.7.13 కోట్లు ఖర్చు పెట్టగా దాదాపు 78 వేల మంది లబ్ధి పొందారు.