వీ6 వెలుగు టోర్నీ : గ్రాండ్ విక్టరీ కొట్టిన వరంగల్ ఈస్ట్, వర్థన్నపేట

వీ6 వెలుగు టోర్నీ : గ్రాండ్ విక్టరీ కొట్టిన వరంగల్ ఈస్ట్, వర్థన్నపేట

వీ6 వెలుగు ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నీ శుక్రవారం ప్రారంభమైంది. టోర్నీ భాగంగా వరంగల్ ఈస్ట్-వర్థన్నపేట టీమ్స్ మధ్యన ఫస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాంటిగ్ ఎంచుకున్న వర్థన్నపేట నిర్ణీత 20 ఓవర్లలో 60 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 61 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన వరంగల్ ఈస్ట్ 6.01 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి గ్రాండ్ విక్టరీ కొట్టింది. 8 వికెట్ల తేడాతో గెలిచిన వరంగల్ ఈస్ట్ పాయింట్ పట్టికలో భోణీ కొట్టింది.

ఆ తర్వాత జరిగిన సెకండ్ మ్యాచ్ లో..వర్థన్నపేట-నర్సంపేట ఢీకొన్నాయి

ఈ మ్యాచ్ లో  టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన నర్సంపేట టీమ్. ఐదు వికెట్లు కోల్పోయి నిర్ణిత 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది. 147 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన వర్థన్నపేట టీమ్.. 6 వికెట్లు కోల్పోయి 147 రన్స్ చేసి విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో లాస్ట్ బాల్ ఒక పరుగు తీయడంతో గెలుపొందింది. వర్ధన్నపేట జట్టు 4 వికెట్లతో ఘన విజయం సాధించింది.

వర్థన్నపేట టీమ్ ప్లేయర్ అఖిల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది.

ఉదయం జరిగిన వరంగల్ ఈస్ట్, మద్యాహ్నం జరిగిన నర్సంపేట జట్లపై రెండు హాఫ్ సెంచరీలతో ఆకట్టున్నాడు అఖిల్.