రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ఈఎస్ఐ ఆస్పత్రులను ఈఎస్ఐసీ పరిధిలోకి తీసుకోవడానికి కేంద్రం ప్రభుత్వం చేస్తున్న ప్రయాత్నాలను వెంటనే విరమించుకోవాలన్నారు ఈఎస్ఐ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ ఛైర్మన్ సీహెచ్ శ్రీనివాస్. మే 9వ తేదీ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ఈఎస్ఐకి వెంటనే డైరెక్టర్ ను నియమించాలని కోరారు. రాష్ట్ర ఈఎస్ఐని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఈఎస్ఐ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కేంద్ర ఈఎస్ఐసీ చర్యలను అడ్డుకునేందుకు ఈఎస్ఐలో ఉన్న ఉద్యోగ సంఘాలు టీజీజీడీఏ, టీఎస్ జీఓ, టీజీఎంఈయూ, బీఆర్ఎస్ కేయూలు కలిసి మే 8వ తేదీన సోమవారం ఈఎస్ఐ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ఈఎస్ఐసీలో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.