త్వరలో నోటిఫికేషన్లు రానున్నాయి.. రెడీ కండి

త్వరలో నోటిఫికేషన్లు రానున్నాయి.. రెడీ కండి
  • ఉన్నత విద్యామండలి చైర్మెన్‌‌‌‌‌‌‌‌ లింబాద్రి 

డిచ్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు:  రాష్ట్రంలో త్వరలోనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు రానున్నాయని.. పోటీ పరీక్షలకు స్టూడెంట్లు రెడీ కావాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ లింబాద్రి చెప్పారు.అన్ని యూనివర్సిటీల్లో కాంపిటీటివ్​ ఎగ్జామ్స్​కు సంబంధించి  కోచింగ్​ క్లాసులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎక్సెల్‌‌‌‌‌‌‌‌ ఇండియా మాగజైన్​ ఆధ్వర్యంలో సోమవారం  తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన లీడర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ మీట్‌‌‌‌‌‌‌‌లో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కూడా  జరగనుందని, వీటి  నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ త్వరలో విడుదల కానుందని అన్నారు. యూనివర్సిటీల్లో  సౌకర్యాలు మరింత మెరుగు పడాల్సిఉందన్నారు. ప్రభుత్వ సంస్థలపై విశ్వాసాన్ని పెంచేందుకు ఫ్యాకల్టీ, స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ కృషి చేయాలన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ కు మాత్రమే ఫీజు రీఇంబర్స్​మెంట్100 శాతం వచ్చేదని, ఇప్పుడు ఈ సదుపాయం ఓబీసీ లకు కూడా లభిస్తుందన్నారు. విదేశాల్లోని అనేక  కంపనీల్లో ఇండియన్లు సీఇవో లాంటి కీలక పదవుల్లో ఉన్నారని, ఉన్నత విద్యకు, రిసెర్చ్​కు మనదేశంలో ఎక్కువ నిధులు కేటాయించడమే ఇందుకు కారణమన్నారు. తెలంగాణ గవర్నమెంట్​ ఎడ్యుకేషన్​కు ప్రాధాన్యం ఇస్తోందని, వచ్చే బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో  మన ఊరు మన బడి కార్యక్రమానికి రూ. 7290 కోట్లు కేటాయించనుందని తెలిపారు. 
తెలంగాణ యూనివర్సిటీ అభివృద్దికి రూ. 100 కోట్లు కేటాయించాలని వైస్​ చాన్సలర్​ రవీందర్‌‌‌‌‌‌‌‌ గుప్తా కోరారు. యూనివర్సిటీలో ఇంకా చాలా విభాగాలకు బిల్డింగులు కట్టవలసిఉందన్నారు. టీయూ ని ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ హబ్‌‌‌‌‌‌‌‌ గా మార్చేందుకు ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని, మరిన్ని కొత్త కోర్సులు ప్రారంభించాలని అన్నారు. ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పాపిరెడ్డి, సురభి గ్రూప్‌‌‌‌‌‌‌‌ ఎండీ సురభి అజిత, టీయూ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ శివశంకర్‌‌‌‌‌‌‌‌, ఈసీ మెంబర్‌‌‌‌‌‌‌‌ మారయ్య గౌడ్‌‌‌‌‌‌‌‌, ఎక్సెల్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఛీప్‌‌‌‌‌‌‌‌ ఎడిటర్‌‌‌‌‌‌‌‌ రామకృష్ణ, సీనియర్‌‌‌‌‌‌‌‌ ఎడిటర్‌‌‌‌‌‌‌‌ రాంమోహన్‌‌‌‌‌‌‌‌, హన్స్‌‌‌‌‌‌‌‌ ఇండియా డిప్యూటీ ఎడిటర్‌‌‌‌‌‌‌‌ భాస్కర్‌‌‌‌‌‌‌‌, ఆర్కే గ్రూప్‌‌‌‌‌‌‌‌ సీఈవో జైపాల్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఉషోదయ గ్రూప్‌‌‌‌‌‌‌‌ చైర్మెన్‌‌‌‌‌‌‌‌ సూర్య ప్రకాష్‌‌‌‌‌‌‌‌, ప్రొఫెసర్స్‌‌‌‌‌‌‌‌, స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌  పాల్గొన్నారు.