రాష్ట్రంలో వ్యాక్సినేషన్ స్పీడ్‌‌ తగ్గింది

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ స్పీడ్‌‌ తగ్గింది
  • ఇప్పటివరకు రాష్ట్ర టార్గెట్ లో 64% మందికే టీకాలు
  • ఎల్లుండి నుంచి ప్రైవేట్ హెల్త్ స్టాఫ్ కు వ్యాక్సినేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ స్పీడ్ తగ్గింది. శుక్రవారం 28,433 మందికి వ్యాక్సిన్ వేయాలని టార్గెట్ పెట్టుకోగా, 12,944 మంది మాత్రమే టీకా వేసుకోవడానికి ముందుకొచ్చారు. వీరితో కలిపి వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 1,10,248కి పెరిగిందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం నుంచి ప్రైవేట్ హెల్త్ స్టాఫ్‌‌కు వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. గవర్నమెంట్ హెల్త్ స్టాఫ్‌‌ కోసం ఈ నెల 16 నుంచి శుక్రవారం వరకూ 5 రోజులు వ్యాక్సినేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ఐదు రోజుల్లో 64 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇంకో 36 శాతం మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రాలేదు.

మరిన్ని డోసులు

రాష్ట్రానికి మరిన్ని కొవ్యాగ్జిన్ డోసులను కేంద్ర సర్కార్ కేటాయించింది. భారత్ బయోటెక్ స్టోరేజీ సెంటర్ నుంచి శుక్రవారం 1,68,960 వ్యాక్సిన్‌‌ డోసులను కోఠిలోని గవర్నమెంట్ డ్రగ్ స్టోరేజీ సెంటర్‌‌‌‌కు తరలించారు. ఇప్పటికే 20 వేల కొవ్యాగ్జిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. ఈ వారంలో వీటిని వినియోగిస్తామని ఆఫీసర్లు తెలిపారు.

For More News..

20 ఏండ్ల నుంచి డైట్ కాలేజీల్లో రిక్రూట్​మెంట్​ బంద్​

కిలిమంజారో పర్వతమెక్కిన హైదరాబాద్ సీపీ

హోం ట్యూషన్లకు ఫుల్ డిమాండ్​.. నెలకు రూ. 3 నుంచి 15 వేలు

V6 రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు