జనరల్​ పబ్లిక్​కు వచ్చే నెలలో వ్యాక్సిన్

జనరల్​ పబ్లిక్​కు వచ్చే నెలలో వ్యాక్సిన్
  • నేటి నుంచి హెల్త్ వర్కర్లకు సెకండ్‌ డోసు
  • ఫ్రంట్ లైన్‌ వర్కర్లకు ముగిసిన వ్యాక్సినేషన్‌
  • టీకాకు దూరంగా 67 శాతం మంది వర్కర్లు

హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల రెండో వారం నుంచి జనరల్​ పబ్లిక్​కు కరోనా వ్యాక్సిన్​ వేయనున్నారు. 50 ఏండ్లు దాటినోళ్లకు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి కరోనా వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను కేంద్ర సర్కారు ఆదేశించింది. ఈ మేరకు స్టేట్ హెల్త్ డిపార్ట్‌‌మెంట్ లబ్ధిదారుల జాబితా రూపొందించే పనిమొదలెట్టింది. దీర్ఘకాలిక జబ్బులున్న వ్యక్తులు, 50 ప్లస్ ఏజ్​ ఉన్నవాళ్ల వివరాలు సేకరించాలని జిల్లా ఆఫీసర్లకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. ఓటర్ ఐడీ కార్డు లేదా మరేదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడీ కార్డు ఆధారంగా వివరాలు నమోదు చేయనున్నారు. కొవిన్ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌లోనూ వివరాలు నమోదు చేసుకునేందుకు త్వరలోనే అవకాశం ఇవ్వనున్నారు. ఎవరికివారే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా సాఫ్ట్‌‌వేర్‌‌‌‌లో మార్పులు చేస్తున్నట్టు అధికారులు
తెలిపారు.

వారికి నేటి నుంచి సెకండ్ డోసు

ఫస్ట్ డోసు వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ కేర్ వర్కర్లకు శనివారం నుంచి సెకండ్ డోసు వేయనున్నారు. ఈ మేరకు హెల్త్ డిపార్ట్‌‌మెంట్ షెడ్యూల్ విడుదల చేసింది. ఫస్ట్ డోసు తీసుకున్న తర్వాత సీరియస్, సివియర్ రియాక్షన్స్.. ఎలర్జీ వచ్చిన వాళ్లకు సెకండ్ డోసు ఇవ్వొద్దని సెంట్రల్ హెల్త్ డిపార్ట్‌‌మెంట్ సూచించింది. ఈ నెల 13 నుంచి 22 వరకూ 1,93,485 మందికి సెకండ్ డోసు వేయనున్నారు.

ఫ్రంట్‌‌ లైన్‌‌ వర్కర్లకు కంప్లీట్

ఫ్రంట్‌‌ లైన్ వర్కర్లకు ఫస్డ్ డోసు వ్యాక్సినేషన్ శుక్రవారంతో ముగిసింది. మొత్తం 2 లక్షల 56 వేల 895 మంది ఫ్రంట్‌‌ లైన్ వర్కర్లు ఉండగా.. 84 వేల 340 మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నట్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రతి వంద మందిలో 33 మంది మాత్రమే వ్యాక్సిన్‌‌ తీసుకోగా.. 67 మంది దూరంగా ఉన్నారు.

For More News..

హుజూర్​నగర్​.. సాగర్ హామీలు సేమ్ టు సేమ్