కరోనా వేరియంట్లపై ఫైజర్ టీకా ప్రభావం ఎక్కువ

కరోనా వేరియంట్లపై ఫైజర్ టీకా ప్రభావం ఎక్కువ

ఇండియాలో గుర్తించిన కరోనా వేరియంట్ పై తమ టీకా ఎఫెక్టివ్ గా పని చేస్తోందని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది అమెరికాకు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ ఫైజర్. భారత్ లో అత్యవసర వినియోగానికి అప్రూవర్ ఇస్తే... ఏడాది చివరి నాటికి 5 కోట్ల డోసులు అందిస్తామని స్పష్టం చేసింది. ఈ వ్యాక్సిన్ 12 ఏళ్లు పైబడిన వారికి కూడా పని చేస్తోందని చెప్పారు. అంతేకాక వ్యాక్సిన్ స్టోర్ చేయడం కూడా చాలా సులభమని చెప్పింది. నెల రోజుల పాటు 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర స్టోర్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటికే భారత ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైన ఫైజర్ ప్రతినిధులు కరోనాపై  వ్యాక్సిన్ పని చేస్తున్న తీరును వివరించారు. ఈ వ్యాక్సిన్ వినియోగానికి ఇతర దేశాలు, WHO ఆమోదం తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు.