ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్​ టౌన్​, వెలుగు : ధనుర్వాతం, కంఠసర్పి వ్యాధుల నుంచి  పిల్లలను రక్షించేందుకు ఈనెల 7 నుంచి 19వ వరకు టీడీ (టెటనస్  అండ్ డిఫ్తీరియా) టీకాలు ఇవ్వనున్నట్లు మెదక్​ అడిషనల్​కలెక్టర్​రమేశ్​ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్​లోని వీడియో కాన్ఫరెన్స్​ హాల్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధనుర్వాతం రాకుండా గతంలో టెటనస్ టీకా ఇచ్చేవారని,  కానీ డిఫ్థేరియాతో పిల్లలు బాధపడుతున్నారని  గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 2017 నుంచి టెటనస్ స్థానంలో టీడీ వ్యాక్సిన్ ఇస్తోందని తెలిపారు. కరోనా కారణంగా గత రెండేండ్ల నుంచి పిల్లలకు పూర్తి స్థాయిలో టీకా ఇవ్వలేకపోయినందున ఈనెల 7 నుంచి 19 వరకు  ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. 10 నుంచి 16 సంవత్సరాల వయస్సు ఉన్న  విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఈ టీకా ఇవ్వనున్నట్లు చెప్పారు. బడిబయట పిల్లలకు అంగన్​వాడీ కేంద్రాలలో ఇస్తామని చెప్పారు. టీకా ఇచ్చేందుకు  ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని హెడ్మాస్టర్లకు సూచించారు. టీకా ఇచ్చినట్లు ధ్రువపత్రం ఇవ్వాలని చెప్పారు. డీఎం హెచ్​వో డాక్టర్​ విజయ నిర్మల, జిల్లా ఆఫీసర్​ నవీన్, తదితరులు పాల్గొన్నారు. 


అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
కోహెడ(హుస్నాబాద్​), వెలుగు: అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని హుస్నాబాద్​ఎమ్మెల్యే వొడితెల సతీశ్ ​కుమార్​అన్నారు. శుక్రవారం హుస్నాబాద్​ పట్టణంలో సీసీ రోడ్డు, సైడ్​ డ్రైనేజీల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్​ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అన్ని హంగులతో హుస్నాబాద్​ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే హుస్నాబాద్​కు స్వచ్ఛ సర్వేక్షణ్​ అవార్డు వచ్చిందన్నారు. 

అధికారుల తీరుపై సర్పంచుల ఫైర్..
నారాయణ ఖేడ్, వెలుగు : ఉపాధి హామీ పథకంలో పనులు చేయించుకొని పైసలు ఇవ్వకపోవడంతో అధికారుల తీరుపై ఆయా గ్రామాల సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్ పలువురు సర్పంచులు మాట్లాడారు. తాము ఉపాధి హామీ పథకం ద్వారా పలు అభివృ ద్ధి పనులు చేయించినప్పటికీ బిల్లులు చెల్లించలేదన్నారు. ఈ విషయం గత మీటింగ్​ లోనూ చెప్పినా ఇప్పటి వరకు పరిష్కరించలేదని తెలిపారు. ఎంపీపీ చాందీ బాయ్ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో వెంకటేశ్వర్​ రెడ్డి, ఎమ్మార్వో మురళి, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.  

ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి

సంగారెడ్డి టౌన్, వెలుగు :  జిల్లాలో ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ శరత్  మండల తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధరణి దరఖాస్తుల పరిష్కారం, పెండింగ్స్ తదితర అంశాలపై మండలం వారీగా ఆయన సమీక్షించారు. ధరణి దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో పెండింగ్​లో ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో తహసీల్దార్లు  సీరియస్ గా పని చేయాలన్నారు. దరఖాస్తులు తిరస్కరిస్తే దానికి సంబంధించిన కారణం తప్పనిసరిగా చూపాలన్నారు. పాస్ బుక్ డేటా కరక్షన్, సక్సేషన్, మ్యూటేషన్, మిస్సింగ్ నంబర్స్, కన్వెన్షన్ ఇంటిమేషన్, జీఎల్ఎం, జీపీఎల్ఏ, ప్రొహిబిషన్ ప్రాపర్టీస్, కోర్టు కేసెస్​, తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించి క్లియర్ చేయాలని సూచించారు. ఈనెలాఖరులోగా అన్ని  పరిష్కరించాలన్నారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్ఓ రాధికారమణి, రెవెన్యూ డివిజనల్ అధికారులు పాల్గొన్నారు.

ట్రైనీ ఆఫీసర్ల క్షేత్ర పర్యటన 

సిద్దిపేట, వెలుగు:  ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే అధికారులకు మంచి పేరు లభిస్తుందని, ఈ విషయాన్ని ఎవరూ మరచిపోవద్దని అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్​ఖాన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్​ లో  ఎంసీహెచ్ఆర్డీ లో శిక్షణ పొందుతున్న 21 మంది సెంట్రల్ సెక్రటేరియట్ అసిస్టెంట్ సెక్షన్   అధికారులు జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాలలో ఆరు రోజులపాటు  పర్యటించారు. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అభివృద్ధిలో మొదటి వరుసలో ఉందన్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ సెక్రటేరియల్ అసిస్టెంట్ సెక్షన్ అధికారులు ఆయా గ్రామాల్లో  అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు,  అధికార యంత్రాంగం పనితీరు పరిశీలించి వారి  అనుభవాలను అడిషనల్​ కలెక్టర్ తో పంచుకున్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, గ్రామ పరిపాలన వ్యవస్థ, వ్యవసాయ రంగం, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ పోలీసు వ్యవస్థ, విద్య, వైద్యం, శానిటేషన్, రహదారులు, విద్యుత్ వ్యవస్థ తదితర సౌకర్యాల తీరు బాగున్నాయని వివరించారు. ప్రోగ్రాం మోడల్ అధికారి  డీఆర్డీఏ  ఏపీడీ ఓబులేసు, ఎంపీడీవోలు 
పాల్గొన్నారు. 


కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్ముకోవాలి 

మెదక్ /మెదక్​టౌన్/సిద్దిపేట/కంది, వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు అన్నారు. శుక్రవారం కౌడిపల్లి, శివ్వంపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను నర్సాపూర్​ఎమ్మెల్యే  మదన్​రెడ్డి, పెద్ద శంకరంపేట మండల పరిధిలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రారంభించారు. సంగారెడ్డి మండల పరిధిలోని నాగపూర్ గ్రామంలో  తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్  చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, సిద్దిపేట మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ విజిత వేణుగోపాల్ రెడ్డి ఓపెన్​ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు వడ్లను దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు. 

దాసారం గుట్ట దేవాదాయ శాఖకు అప్పగించే వరకూ పోరాటం:జేఏసీ చైర్మన్ భైరవబట్ల చక్రధర్
కొమురవెల్లి, వెలుగు : దాసారం గుట్టను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో మల్లన్న ఆలయం కోసం కొనుగోలు చేసే వరకూ తమ పోరాటం ఆగదని జేఏసీ చైర్మన్ భైరవబట్ల చక్రధర్ అన్నారు. శుక్రవారం నిజ నిర్ధారణ కమిటీ, స్థానిక విశ్వకర్మ సంఘం సభ్యులు పలురాజకీయ పార్టీల నాయకులతో కలిసి దాసారం గుట్టను పరిశీలించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ ఎదుట నిరసన తెలిపి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాసారం గుట్ట ఉన్న పురాతనమైన సంగన్న ఆలయాన్ని ప్రభుత్వం కాపాడాలన్నారు. ఇదిలా ఉండగా జేఏసీ గుట్ట పరిశీలనకు వెళ్లడంతో కవరేజ్ కోసం వెళ్లిన విలేకరులపై గుట్టను కొనుగోలు చేసిన ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో  బెదిరించిన వ్యక్తిపై పోలీస్ స్టేషన్​లో విలేకరులు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి అందే భీరన్న, జేఏసీ కన్వీనర్ బందిగా రాకేశ్ కృష్ణన్,  ఏఐఎస్బీ జిల్లా అధ్యక్షుడు పుల్లని వేణు, జేఏసీ చేర్యాల మండల కో కన్వీనర్, కొమురవెల్లి జేఏసీ కన్వీనర్ బురు గోజు నాగరాజు ఉన్నారు. 

వివిధ శాఖల అధికారులతో ఎస్పీ  సమీక్ష

మెదక్ (పెద్దశంకరంపేట), వెలుగు :  మెదక్ జిల్లాలో శని, ఆదివారాల్లో జరుగనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై సీఆర్పీఎఫ్​ అధికారి గజానన్​తో కలిసి ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్ లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రాహుల్​గాంధీ అల్లాదుర్గం వద్ద బస చేసే ప్రాంతంతోపాటు పెద్దశంకరంపేట మండలం కమలాపూర్ వద్ద ఆయన విశ్రాంతి తీసుకునే  ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ,  అంబులెన్స్, మండల కాంగ్రెస్ కార్యకర్తలు ఆయా శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐసీసీ బాధ్యులు దేవేందర్, ఖాదర్, డీఎస్పీ రవీందర్ రెడ్డి, మెదక్ ఆర్డీవో సాయిరామ్,  తహసీల్దార్​ చరణ్ సింగ్, ఎస్సైలు బాలరాజు, సత్యనారాయణ, ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.

మెదక్ (పెద్దశంకరంపేట), వెలుగు :  మెదక్ జిల్లాలో శని, ఆదివారాల్లో జరుగనున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై సీఆర్పీఎఫ్​ అధికారి గజానన్​తో కలిసి ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్ లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రాహుల్​గాంధీ అల్లాదుర్గం వద్ద బస చేసే ప్రాంతంతోపాటు పెద్దశంకరంపేట మండలం కమలాపూర్ వద్ద ఆయన విశ్రాంతి తీసుకునే  ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ,  అంబులెన్స్, మండల కాంగ్రెస్ కార్యకర్తలు ఆయా శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐసీసీ బాధ్యులు దేవేందర్, ఖాదర్, డీఎస్పీ రవీందర్ రెడ్డి, మెదక్ ఆర్డీవో సాయిరామ్,  తహసీల్దార్​ చరణ్ సింగ్, ఎస్సైలు బాలరాజు, సత్యనారాయణ, ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.


హిందుత్వం మతం కాదు.. జీవన విధానం
సిద్దిపేట, వెలుగు  : హిందుత్వం అంటే మతం కాదు.. హిందువుల  జీవన విధానమనే విషయాన్ని గ్రామ గ్రామాన చాటాలని విశ్వహిందూ పరిషత్ మెదక్ విభాగ్ సహ కార్యదర్శి గ్యాదరి రాజారాం అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో  విశ్వహిందూ పరిషత్ సభ్యత్వ నమోదు హిత చింతక్ అభియాన్ పాంప్లేట్​ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ దేవతలతో పాటు ఆచార  సాంప్రదాయాలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్క హిందువు హిత  చింతాక్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వాన్ని  నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈనెల 6 నుంచి 20 వరకు ఈ కార్యకరమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  కార్యక్రమంలో భజరంగదళ్ సంయోజక్ బుస్స  నరేశ్,  విశ్వహిందూ పరిషత్ నాయకులు బచ్చు నాగేందర్,  రాగీరు రాధ, దినేశ్, నాగరాజు,  ఆంజనేయులు  పాల్గొన్నారు. 

దళితుల ఆత్మగౌరవంతో చెలగాటమాడుతున్రు..

చేర్యాల, వెలుగు :  దళితుల ఆత్మగౌరవంతో చేర్యాల మున్సిపల్​పాలక మండలి చెలగాటమాడుతోందని మాజీ ఎంపీపీ డాక్టర్​ రామగళ్ల పరమేశ్వర్ మండిపడ్డారు.  శుక్రవారం మున్సిపల్​ కేంద్రంలో మాల మాదిగ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేర్యాల అంబేద్కర్​ విగ్రహం ఎదురుగా ఉన్న 100 ఫీట్ల రోడ్డును యథాతథంగా కొనసాగించాలని డిమాండ్​ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్​ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం అంబేద్కర్​ సెంటర్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వందల ఏండ్ల కింద ఏర్పాటు చేసిన 100 ఫీట్ల అంగడి బజార్​ రోడ్డును మూసివేయాలని, అంబేద్కర్​విగ్రహం ఖాళీ స్థలాన్ని కుదించాలని, కొత్త భవన నిర్మాణం చేపట్టాలని తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపారని, ఇది సరైంది కాదన్నారు. మున్సిపాలిటీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని పున:పరిశీలించాలని కోరారు. దళితుల మనోభావాలు, ఆత్మగౌరవాన్ని పరిగణలోకి తీసుకుని అంబేద్కర్​ విగ్రహ ప్రాంగణాన్ని కుదించరాదన్నారు.  లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు జి. రాందాసు, కొమ్ము నర్సింగరావు, బి.భిక్షపతి, బి.సత్యనారాయణ, బి.రాజేందర్ తదితరులు 
పాల్గొన్నారు. 

మాచాపూర్​లో ఉచిత కంటి వైద్య శిబిరం

సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని మాచాపూర్ గ్రామంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పంజా భాగ్యలక్ష్మీబాలయ్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. కంటి సమస్యలతో ఒక్కరు కూడా బాధపడకూడదనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టెస్టులు చేయించుకున్నవారిలో కొందరికి ఆపరేషన్లు అవసరం ఉన్నాయని, వారికి త్వరలో ఆపరేషన్లు చేయిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది జాకీర్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు. 


ఏషియన్ బీచ్​ వాలీబాల్​ టోర్నమెంట్స్​కు 
బీహెచ్​ఈఎల్​ క్రీడాకారుల ఎంపిక

రామచంద్రాపురం, వెలుగు:  రామచంద్రాపురం పరిధిలోని బీహెచ్​ఈఎల్​కు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఏషియన్​ బీచ్​ వాలీబాల్​ టోర్నమెంట్​కు శుక్రవారం ఎంపికయ్యారు. కస్టమ్స్​ అండ్ సెంట్రల్ టాక్స్​ డిపార్ట్​మెంట్​లో పనిచేస్తున్న క్రీడాకారులు ఎం. కృష్ణంరాజు, టి.నరేశ్​ ఈనెల 7 నుంచి ఇరాన్​ దేశంలో జరిగే ఏషియన్​ఇంటర్నేషనల్​ బీచ్​ వాలీబాల్​ టోర్నమెంట్​లో పాల్గొననున్నారు. ఈనెల 14 నుంచి అక్కడే జరిగే ఏషియన్ వాలీబాల్​ చాంపియన్​షిప్​లో కూడా వారు ఆడనున్నారు. ఏషియన్​ వాలీబాల్ ఫెడరేషన్, ఇరాన్​ వాలీబాల్ ఫెడరేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్​లో చాన్స్ రావడంసంతోషంగా ఉందని, ప్రతిభను కనబరిచి దేశం పేరు నిలబెడుతామని ఈ సందర్భంగా కృష్ణం రాజు, నరేశ్ పేర్కొన్నారు.