భారత కరోనా వేరియంట్లకు వాటితో చెక్

భారత కరోనా వేరియంట్లకు వాటితో చెక్

వాషింగ్టన్, డీసీ: భారత్ లోని కరోనా వేరియంట్ లపై తమ దేశ టీకాలు బాగా పని చేస్తాయని అమెరికా టాప్ హెల్త్ ఆఫీసర్ అన్నారు. ఇండియాలో గతేడాది B.1.617 అనే కరోనా వేరియంట్ ను కనుగొన్నారు. ఈ వేరియంట్ చాలా ప్రమాదకరమైనదిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఈ నేపథ్యంలో భారత కరోనా వేరియంట్ పై డైరెక్టర్ ఆఫ్ యూఎస్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫీషియస్ డిసీజెస్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ స్పందించారు. 

అమెరికాలో వినియోగంలో ఉన్న కరోనా వ్యాక్సిన్లు మహమ్మారిపై సమర్థంగా పనిచేస్తున్నాయని ఫౌసీ చెప్పారు. ఈ వ్యాక్సిన్లు B.1.617, B.1.168 రకాల నుంచి రక్షణ కల్పిస్తాయన్నారు. అమెరికాలో ఇప్పటి వరకు ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వేరియంట్లపై ఫైజర్‌, మోడెర్నా టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు అమెరికాకు చెందిన ఎన్‌వైయూ గ్రాస్‌మాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, లాంగోన్‌ సెంటర్‌కు చెందిన సైంటిస్టులు తెలిపారు.