సెప్టెంబర్ చివరి నాటికి పిల్లలకు వాక్సిన్

సెప్టెంబర్ చివరి నాటికి పిల్లలకు వాక్సిన్

కరోనా వైరస్ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న క్రమంలో  కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు కూడా వేసుకోవాల్సిన అవసరం రావచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా తెలిపారు. పిల్లలకు కరోనా టీకాపై భారత్ బయోటెక్ చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు సెప్టెంబర్ వరకు రావచ్చని తెలిపారు. చిన్నారులపై ఇప్పటికే ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. 2 నుంచి 12 ఏళ్ల లోపు వయస్సు వారి కోసం భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకా.. రెండో, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయని తెలిపారు. సెప్టెంబరు చివరి నాటికి భారత్‌లో చిన్నారులకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రణ్‌దీప్ గులేరియా చెప్పారు. జైడస్‌ క్యాడిలా తయారు చేసిన టీకా చిన్నారులపై ప్రయోగాలు పూర్తయ్యాయని... టీకా వినియోగ అనుమతి కోసం డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) కు దరఖాస్తు చేసుకుందని చెప్పారు.