అసత్య ప్రచారం చేస్తే చర్యలు : వాగీశ్‌‌కుమార్‌‌ సింగ్‌‌

అసత్య ప్రచారం చేస్తే చర్యలు : వాగీశ్‌‌కుమార్‌‌ సింగ్‌‌
  •     ఎలక్షన్‌‌ కోడ్‌‌ను తప్పనిసరిగా పాటించాలి
  •     ఎన్నికల వ్యయ పరిశీలకులు వాగీశ్‌‌కుమార్‌‌ సింగ్‌‌

ములుగు, వెలుగు : ఎన్నికల కోడ్‌‌ను ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు వాగీశ్‌‌కుమార్‌‌ సింగ్‌‌ చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ములుగు కలెక్టరేట్‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌‌, ఎంసీఎంసీ సెల్‌‌ను శనివారం కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠితో కలిసి తనిఖీ చేశారు. ఎంసీఎంసీ సెల్​ ద్వారా చేపడుతున్న పనుల గురించి తెలుసుకున్నారు. 

అనంతరం వాగీశ్‌‌కుమార్‌‌ సింగ్‌‌ మాట్లాడుతూ లోకల్‌‌ ఛానల్స్‌‌లో వచ్చే వార్తలను కూడా రికార్డు చేయాలని సూచించారు. పెయిడ్‌‌ ఆర్టికల్స్‌‌, పర్మిషన్‌‌ లేకుండా యాడ్స్‌‌ వేయడం, సోషల్‌‌ మీడియాతో క్యాండిడేట్ల ప్రకటనలపై స్పందించాలని ఆదేశించారు. వాట్సప్‌‌ గ్రూప్స్‌‌లో తప్పడు సమాచారం వ్యాప్తి చెందకుండా అడ్మిన్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం సీసీ కెమెరాల రికార్డింగ్‌‌ రూమ్‌‌ను పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్‌‌ కలెక్టర్‌‌ డీఎస్.వెంకన్న, డీపీఆర్‌‌వో రఫిక్‌‌, ఎంసీఎంసీ కమిటీ సభ్యుడు శ్రీధర్, కొత్తపెల్లి ప్రసాదరావు, ఈడీఎం దేవేందర్‌‌ పాల్గొన్నారు.

ప్రతి వెహికల్‌‌ను తనిఖీ చేయాలి

వరంగల్​సిటీ, వెలుగు : ప్రతి వెహికల్‌‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు అమిత్‌‌ ప్రతాప్‌‌సింగ్‌‌ ఆదేశించారు. వరంగల్‌‌ తూర్పు నియోజకవర్గ పరిధిలో స్టాటిస్టికల్‌‌ సర్వేలెన్స్ టీమ్స్‌‌ పనితీరు, వాహనాల తనిఖీని శనివారం పరిశీలించి మాట్లాడారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలు, డబ్బు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యయ పరిశీలన నోడల్‌‌ ఆఫీసర్‌‌ సంజీవరెడ్డి, స్టాటిస్టికల్‌‌ సర్వేలెన్స్‌‌ టీమ్‌‌ మెంబర్స్‌‌ యూసుఫొద్దీన్‌‌, శ్రీనివాస్‌‌రెడ్డి పాల్గొన్నారు. 

అనంతరం జీడబ్ల్యూఎంసీలోని రిటర్నింగ్‌‌ ఆఫీస్‌‌న పరిశీలించారు. క్యాండిడేట్ల నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. నామినేషన్‌‌ నాటి నుంచే అభ్యర్థుల ఖర్చు వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. రిటర్నింగ్‌‌ ఆఫీసర్‌‌ షేక్‌‌ రిజ్వాన్‌‌ బాషా, అడిషనల్‌‌ కమిషనర్‌‌ అనీస్‌‌ ఉర్‌‌ రషీద్‌‌ ఉన్నారు.

యువత ఓటు హక్కును వినియోగించుకోవాలి

మహబూబాబాద్, వెలుగు : యువత తప్పనిసరిగా ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌‌ శశాంక సూచించారు. స్వీప్‌‌ కార్యక్రమంలో భాగంగా శనివారం స్టూడెంట్లతో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఎంపీడీవో ఆఫీస్‌‌ నుంచి కార్గిల్‌‌ సెంటర్‌‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌ మాట్లాడుతూ దేశ భవిష్యత్‌‌ యువత చేతిలోనే ఉందన్న విషయం మర్చిపోవద్దన్నారు. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా వారిని అవగాహనపరచాలని సూచించారు. 

కార్యక్రమంలో తొర్రూరు డీఎస్పీ వెంకటేశ్వరబాబు, ఎంపీడీవో ధన్‌‌సింగ్‌‌, ,మున్సిపల్‌‌ కమిషనర్‌‌ రాజు, స్వీప్‌‌ నోడల్‌‌ ఆఫీసర్‌‌ నరేశ్‌‌ పాల్గొన్నారు. అనంతరం డోర్నకల్‌‌లోని రిటర్నింగ్‌‌ ఆఫీస్‌‌ను పరిశీలించారు. నామినేషన్‌‌ సెంటర్‌‌కు 100 మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేయాలని సూచించారు. నామినేషన్‌‌ వేసే క్యాండిడేట్‌‌తో పాటు మరో నలుగురిని మాత్రమే అనుమతించాలని ఆదేశించారు.