రిసెట్ మోడ్‌లో వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వే సిరీస్‌కు ముందు నయా ప్లాన్!

రిసెట్ మోడ్‌లో వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వే సిరీస్‌కు ముందు నయా ప్లాన్!

Vaibhav Sooryavanshi: భారత బ్యాటింగ్ రంగానికి సరికొత్త వెలుగులు తెచ్చిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ఒక ప్రత్యేకమైన భావోద్వేగంతో జింబాబ్వే పర్యటనకు సిద్ధమయ్యాడు. రేపు (జులై 23న, గురువారం) జింబాబ్వేతో జరగనున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపికైన భారత సీనియర్ జట్టులో ఈ కుర్రాడికి చోటు దక్కింది. కొన్ని నెలల క్రితం ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో తన ఆల్‌టైమ్ రికార్డులతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన చారిత్రాత్మక హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలోనే సూర్యవంశీ మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.  

సీనియర్ టీమ్‌లో గోల్డెన్ ఛాన్స్: 

అండర్-19 ప్రపంచకప్ హీరోగా మారిన తర్వాత వైభవ్ సూర్యవంశీ కెరీర్‌లో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయి. రాత్రికి రాత్రే పెరిగిన అంచనాలు, ఫామ్ లేమి కారణంగా గత కొన్ని నెలలుగా అతడు ఇబ్బంది పడ్డాడు. కానీ సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్న ఈ తరుణంలో.. తనకు బాగా కలిసొచ్చిన హరారే మైదానంలోనే మళ్లీ పాత ఫామ్ (Rhythm)ని అందుకోవాలని అతడు భావిస్తున్నాడు.

నన్ను నేను నిరూపించుకోవడానికి ఇదో మంచి ఛాన్స్: 

హరారే మైదానానికి నా హృదయంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది అని వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. నా కెరీర్‌లో అత్యంత గొప్ప క్షణాలు అక్కడే ఆవిష్కృతమయ్యాయి. ఆ జ్ఞాపకాలు నాకు మళ్లీ పూర్తి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి.. గడిచిన కొద్ది రోజులుగా ఫామ్ విషయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, వాటిని దాటుకుని సీనియర్ స్థాయిలో నన్ను నేను నిరూపించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం అని వైభవ్ పేర్కొన్నాడు. 

జాతీయ జట్టులో ప్రూవ్ చేసుకునేందుకు మంచి ఫామ్:  

భారత్-జింబాబ్వే మధ్య జరగనున్న ఈ మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ మొత్తం హరారే వేదికగానే జరగనున్నాయి. పొట్టి ఫార్మాట్‌లో యువకులకి అవకాశాలు ఇవ్వాలని చూస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఈ సిరీస్ ఒక కీలకమైన మైలురాయి. ప్రపంచానికి తన ప్రతిభను చాటిచెప్పిన అదే హరారే మైదానంలో, ఇప్పుడు సీనియర్ టీమ్ జెర్సీతో బరిలోకి దిగుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో అని అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.