వైభవ్‌‌‌‌ సూర్యవంశీకి రాష్ట్రీయ బాల్‌‌‌‌ పురస్కార్‌‌‌‌

వైభవ్‌‌‌‌ సూర్యవంశీకి  రాష్ట్రీయ బాల్‌‌‌‌ పురస్కార్‌‌‌‌

న్యూఢిల్లీ: బలమైన స్ట్రోక్‌‌‌‌ ప్లేతో క్రికెట్‌‌‌‌లో సంచలనాలు సృష్టిస్తున్న 14 ఏళ్ల వైభవ్‌‌‌‌ సూర్యవంశీ.. ‘ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి రాష్ట్రీయ్‌‌‌‌ బాల్‌‌‌‌ పురస్కార్‌‌‌‌’ను అందుకున్నాడు. 

శుక్రవారం రాష్ట్రపతి భవన్‌‌‌‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును బహుకరించారు. క్రీడలు, ధైర్యం, సామాజిక సేవ, పర్యావరణ రంగంలో అసాధారణ ప్రతిభను చూపెట్టిన వారికి ఈ అవార్డును ఇస్తారు. ఇటీవల జరిగిన విజయ్‌‌‌‌ హజారే ట్రోఫీలో బిహార్‌‌‌‌ తరఫున సూర్యవంశీ 190 రన్స్‌‌‌‌ చేశారు. ఈ క్రమంలో లిస్ట్‌‌‌‌–ఎ క్రికెట్‌‌‌‌లో అతిపిన్న వయసు (14 ఏళ్ల 272 రోజులు)లో సెంచరీ కొట్టిన మెన్స్‌‌‌‌ క్రికెటర్‌‌‌‌గా రికార్డులకెక్కాడు. ఇక ఐపీఎల్‌‌‌‌లోనూ రాజస్తాన్‌‌‌‌ రాయల్స్‌‌‌‌ తరఫున 38 బాల్స్‌‌‌‌లోనే 101 రన్స్‌‌‌‌ కొట్టాడు. తద్వారా మెన్స్ టీ20ల్లో అతిపిన్న వయసులో సెంచరీ చేసిన ప్లేయర్‌‌‌‌గా నిలిచాడు.