బీహార్ యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం కొనసాగుతోంది. నిలకడగా ఆడడంతో పాటు వేగంగా పరుగులు చేస్తున్న ఈ 14 ఏళ్ళ కుర్రాడు ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. తాజాగా ఈ టీనేజ్ కుర్రాడు అండర్-19 క్రికెట్ లో సౌతాఫ్రికాపై సెంచరీతో దుమ్ములేపాడు. అండర్-19 సిరీస్ లో భాగంగా బుధవారం (జనవరి 7) సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో వైభవ్ మరోసారి తన తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగాడు. బెనోని వేదికగా విల్లోమూర్ పార్క్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో 63 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని స్టేడియాన్ని హోరెత్తించాడు.
ఓపెనర్ గా బరిలోకి దిగిన వైభవ్.. ప్రారంభం నుంచి తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. ఇన్నింగ్స్ 7 ఓవర్లో వరుసగా 4,6,4,6 కొట్టి 20 పరుగులు రాబట్టాడు. ఇన్నింగ్స్ 8 ఓవర్ లో కేవలం 24 బంతుల్లోనే సూర్యవంశీ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ ఆతర్వాత కూడా ఎక్కడా తన విధ్వంసం తగ్గలేదు. సూర్యవంశీ ధాటికి తొలి 10 ఓవర్లలోనే ఇండియా 111 పరుగులు చేసింది. ఆడుతుంది వన్డే అయినప్పటికీ టీ20 తరహా బ్యాటింగ్ తో శివాలెత్తాడు. దీంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 18 ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టి సెంచరీకి చేరువయ్యాడు.
ఇన్నింగ్స్ 23 ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో వైభవ్ 74 బంతుల్లోనే 127 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ యంగ్ క్రికెటర్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లతో పాటు.. 10 సిక్సర్లున్నాయి. సూర్యతో పాటు మరో ఓపెనర్ జార్జి కూడా సెంచరీ బాదడంతో ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇండియా ప్రస్తుతం 29 ఓవర్లలో వికెట్ నష్టానికి 242 పరుగులు చేసింది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ గెలుచుకున్న భారత జట్టు.. ఈ మ్యాచ్ లోనూ గెలిస్తే సఫారీలను క్లీన్ స్వీప్ చేయొచ్చు.
🚨 HUNDRED FOR VAIBHAV SURYAVANSHI 🚨
— Sports Culture (@SportsCulture24) January 7, 2026
- Smashed 100* runs off 63balls vs SA U19.
- With 8 sixes and 6 fours. pic.twitter.com/al1eebWiVu
