పాఫోస్ (సైప్రస్): క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. వైశాలి టైటిల్ దిశగా దూసుకుపోతోంది. అలెగ్జాండ్రా గొర్యాచ్కినా (రష్యా)తో శనివారం జరిగిన 11వ రౌండ్ గేమ్‌లో వైశాలి 45 ఎత్తుల వద్ద విజయం సాధించింది. ఈ రౌండ్ తర్వాత ఇండియన్ ప్లేయర్ 7 పాయింట్లతో టాప్ ప్లేస్‌ను మరింత పదిలం చేసుకుంది. జు జినెర్ (చైనా)తో గేమ్‌ను దివ్య దేశ్‌ముఖ్ 47 ఎత్తుల వద్ద డ్రా చేసుకుంది. ప్రస్తుతం దివ్య ఖాతాలో ఐదు పాయింట్లు ఉన్నాయి. ఓపెన్ సెక్షన్‌లో మథియాస్ బ్లూబామ్‌తో గేమ్‌ను ఆర్. ప్రజ్ఞానంద 42 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు.
