గ్రాండ్‌‌‌‌‌‌‌‌ స్విస్‌‌‌‌‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌ వైశాలి .. క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీకి అర్హత

గ్రాండ్‌‌‌‌‌‌‌‌ స్విస్‌‌‌‌‌‌‌‌ విన్నర్‌‌‌‌‌‌‌‌ వైశాలి .. క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీకి అర్హత

న్యూఢిల్లీ: ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌. వైశాలి.. గ్రాండ్‌‌‌‌‌‌‌‌ స్విస్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ను నిలబెట్టుకుంది. సోమవారం టాన్‌‌‌‌‌‌‌‌ జోంగాయ్‌‌‌‌‌‌‌‌ (చైనా)తో జరిగిన 11వ రౌండ్‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌ను వైశాలి 43 ఎత్తుల వద్ద డ్రా చేసుకుంది. దాంతో 8 పాయింట్లతో టైటిల్‌‌‌‌‌‌‌‌ను సొంతం చేసుకుంది.

 ఈ విజయంతో వైశాలి.. వచ్చే ఏడాది జరగనున్న క్యాండిడేట్స్ టోర్నీకి డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా అర్హత సాధించింది ఈ ఘనత సాధించిన మూడో ఇండియన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా రికార్డులకెక్కింది. కోనేరు హంపి, దివ్య దేశ్‌‌‌‌‌‌‌‌ముఖ్‌‌‌‌‌‌‌‌ సరసన  చోటు సంపాదించింది. వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌ ద్వారా హంపి, దివ్య క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీకి క్వాలిఫై అయ్యారు. క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో ఆడనుండటం వైశాలికి ఇది రెండోసారి కావడం విశేషం. జోంగాయ్‌‌‌‌‌‌‌‌తో జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌లో తెల్లపావులతో ఆడిన వైశాలి స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ నుంచి ఆకట్టుకుంది. కీలక టైమ్‌‌‌‌‌‌‌‌లో పావులను చకచకా మారుస్తూ ప్రత్యర్థికి చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టింది.