‘బేబీ’ చిత్రంతో మంచి ఫేమ్ తెచ్చుకున్న వైష్ణవి చైతన్య వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండకు జంటగా ‘90స్’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హసన్ రూపొందిస్తున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆదివారం వైష్ణవి చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఆమె స్పెషల్ పోస్టర్‌తో విషెస్ తెలియజేస్తూ తన క్యారెక్టర్‌ను రివీల్ చేశారు మేకర్స్.
ఇందులో ఆమె కడలి పాత్ర పోషిస్తున్నట్టు విడుదల చేసిన పోస్టర్‌లో వైష్ణవి లుక్ ఇంప్రెస్ చేస్తోంది. తన సహజమైన నటన, ఎనర్జిటిక్ స్ర్కీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందీ పోస్టర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
హేషమ్ అబ్దుల్ వహామ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
