పంజాగుట్ట, వెలుగు: రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వైశ్యులకు సీట్లు ఇస్తే గెలిచి చూపిస్తామని వైశ్యవికాస వేదిక అధ్యక్షుడు కాచం సత్యనారాయణ కోరారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. తాము ఏ రాజకీయ పార్టీకి లేదా వర్గానికి వ్యతిరేకం కాదని, ప్రజా క్షేత్రంలో వైశ్యుల పాత్ర ఉండేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
డా. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు రాజకీయ ప్రాతినిధ్యం లేని జాతి కనుమరుగవుతుందన్న సూత్రాన్ని ఆధారంగా తాము పనిచేస్తున్నామని వివరించారు. నాయకులు పరంధాములు, శ్రీనివాస్, లక్ష్మినారాయణ, విఠల్ పాల్గొన్నారు.
