స్వతంత్ర భారత వజ్రోత్సవాల ప్రారంభోత్సవ కార్య క్రమాలు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల ప్రారంభోత్సవ కార్య క్రమాలు

హెచ్ఐసీసీలో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్​

హైదరాబాద్, వెలుగు: స్వతంత్ర భారత వజ్రోత్సవాల ప్రారంభోత్సవ కార్య క్రమాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఉదయం 11.30 సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్క రించి స్టార్ట్​ చేస్తారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. జిల్లాల నుంచి వచ్చే జడ్పీటీసీలు, ఎంపీపీలకు హైదరాబాద్‌ రావడానికి ప్రత్యేకంగా వాహన సదు పాయాలను ఏర్పాటు చేశామని వెల్ల డించారు.

ఈ కార్యక్రమాల్లో 75 వీణా కళాకారులతో దేశ భక్తి గీతాల వాయిద్య ప్రదర్శన, స్వాతంత్ర్య సమర యోధులను తలుచుకునే శాస్త్రీయ నృత్య ప్రదర్శన, ఫుజన్ డాన్స్ ఉండనున్నాయి. తర్వాత కేసీఆర్ ప్రసంగిస్తారు. 22 వరకు స్వతం త్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో నిర్వహించనున్నారు. ఆది వారం సీఎస్ సోమేశ్‌ కుమార్ హెచ్ఐ సీసీలో ఏర్పాట్లను పరిశీలించారు.