భువనేశ్వరి అక్క సారీ.. ఎమోషనల్ గా నోరు జారా

భువనేశ్వరి అక్క సారీ.. ఎమోషనల్ గా నోరు జారా

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి మాజీ టీడీపీ నేత వల్లభనేని వంశీ  అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఈ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. భువనేశ్వరికి ఆయన క్షమాపణలు చెప్పారు. ఎమోషనల్ లో ఓ పదం నోరు జారిందన్నారు. నేను నోరు జారానని ఒప్పుకుంటున్నామన్నారు. నాకు విజ్ఞత ఉంది కాబట్టే క్షమాపణలు చెప్పానన్నారు. తప్పు మాట్లాడానని ఒప్పుకున్నానన్నారు. ఉద్దేశపూర్వకంగా నేను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. భువనేశ్వరి కనిపిస్తే అక్కా అని పిలిచే వాడిని అన్నారు. ఆమె కూడా ఎంతో ప్రేమగా పలకరించేది అన్నారు. లోకేశ్ కారణంగానే తమ మధ్య సంబంధాలు చెదిరాయన్నారు. 

టీడీపీ నేతలు నా ఫ్యామిలీ గురించి దారుణంగా మట్లాడారన్నారు. అన్ని పార్టీల్లో చంద్రబాబు తన మనుషుల్ని చొప్పించారని వల్లభనేని వంశీ ఆరోపించారు.టీడీపీ నేతలు తమపై చేసిన వ్యాఖ్యల్ని వారెలా సమర్థించుకుంటారు ? అని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబుతో కలిసి పనిచేశామన్నారు. బాబు ఎంతమందిని తిట్టమంటే అంతమందిని తిట్టామన్నారు. మా విషయంలో లోకేశ్ కు అన్ని భయాలు ఉన్నాయన్నారు. పార్టీ నుంచి బయటకు రాగానే.. నేను అవినీతి ఎమ్మెల్యే అన్నారు చంద్రబాబు. పార్టీ నుంచి బయటకు రాగానే.. నేను సంసారానికి పనికి రానని.. నాపై కామెంట్లు చేస్తున్నారని వంశీ ఆరోపించారు. పకోడీ కార్పొరేటర్లు మాట్లాడితే మేం భయపడమన్నారు. పక్క రాష్ట్రం వాళ్ల మాపై మాట్లాడితే మే బెదిరేది లేదన్నారు. నాకు చెప్పాలనిపించింది కాబట్టి... భువనేశ్వరి అక్కకు మనస్ఫూర్తిగా సారీ చెప్పానన్నారు వంశీ.