పవర్‌ గ్రిడ్ సీఎండీగా వంశీ రామ్మోహన్

పవర్‌ గ్రిడ్ సీఎండీగా వంశీ   రామ్మోహన్

హైదరాబాద్, వెలుగు: భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద పని చేసే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీఎండీగా బుర్రా వంశీ రామ్మోహన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో ఇదే కంపెనీలో ప్రాజెక్ట్​డైరెక్టర్ గా పని చేశారు.1993లో పవర్‌గ్రిడ్‌లో ప్రవేశపెట్టిన తొలి బ్యాచ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీల్లో వంశీ రామమోహన్ ఒకరు. 

విద్యుత్ ప్రసరణ, టెలికాం రంగాల్లో 33 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన ప్రాంతీయ, కార్పొరేట్ స్థాయిల్లో అనేక కీలక నాయకత్వ, విధానపరమైన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారు.