కొత్తకోట, వెలుగు : వనపర్తి జిల్లా కొత్తకోట తహసీల్దారు చాంద్ బాషాను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆత్మకూరు తహసీల్దారుగా పనిచేస్తున్న చాంద్ బాషాను డెప్యూటేషన్‌పై కొత్తకోట తహసీల్దార్ గా వేశారు. ఆయన విధుల పట్ల నిర్లక్ష్యం వహించారని, ఉన్నతాధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మెడికల్ లీవ్ పెట్టి వెళ్లడం, ప్రభుత్వ పథకాల అమలులోను నిర్లక్ష్యం వహించడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
