రెండు పార్టీలు తీరుతో మాదిగలకు తీవ్ర అన్యాయం: వంగపల్లి శ్రీనివాస్ 

 రెండు పార్టీలు తీరుతో మాదిగలకు తీవ్ర అన్యాయం: వంగపల్లి శ్రీనివాస్ 

ముషీరాబాద్, వెలుగు :   రెండు పార్టీలు తీరుతో మాదిగలకు తీవ్ర అన్యాయం: వంగపల్లి శ్రీనివాస్వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి ప్రతినిధుల బృందాన్ని పంపి మాదిగల అభివృద్ధికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ కే ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. మంగళవారం విద్యానగర్​లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో బీఆర్ఎస్​కు మద్దతు ఇవ్వాలని తీర్మానించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు గత 28 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తుంటే కాంగ్రెస్, బీజేపీ ఓట్ల కోసం మాదిగలను వాడుకొని మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వర్గీకరణ అంశం కనుమరుగవుతుందని బీజేపీ వస్తే మాదిగలపై దాడులు ,అత్యాచారాలు కొనసాగుతాయని ఆరోపించారు. బీఆర్ఎస్ గెలిస్తే వర్గీకరణ ముందుకు వెళ్తుందని, కేసీఆర్ మాదిగలకు అండగా నిలుస్తారని పేర్కొన్నారు. సమావేశంలో మీసాల మల్లేశ్, గుర్రాల శ్రీనివాస్, చిలకమరి గణేశ్, 
పొట్టపెంజర రమేశ్, సలేంద్ర బాబురావు, ఆకారపు రుక్కమ్మ, డప్పు శివరాజ్ , ధర్మారపు శ్రీకాంత్  పాల్గొన్నారు.