టూరిజం స్పెషల్ సీఎస్గా వాణీ ప్రసాద్‌

టూరిజం స్పెషల్ సీఎస్గా వాణీ ప్రసాద్‌
  •     ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

హైదరాబాద్​, వెలుగు : ఏపీ కేడర్ నుంచి తెలంగాణకు వచ్చిన 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి ఏ. వాణీ ప్రసాద్‌ను ప్రభుత్వం యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఇప్పటివరకు ఈ శాఖ అదనపు బాధ్యతలను  నిర్వహిస్తున్న జయేశ్ రంజన్‌ను ప్రభుత్వం తప్పించింది. 

అయితే, మెట్రోపాలిటన్ ప్రాంతం, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేశ్ రంజన్, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని సీఎస్ కె. రామకృష్ణారావు గురువారం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.