మహేశ్ బాబు 'వారణాసి' కౌంట్‌డౌన్ స్టార్ట్.. రిలీజ్ డేట్‌పై కీరవాణి క్రేజీ అప్‌డేట్!

మహేశ్ బాబు 'వారణాసి' కౌంట్‌డౌన్ స్టార్ట్.. రిలీజ్ డేట్‌పై కీరవాణి క్రేజీ అప్‌డేట్!

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న అడ్వెంచర్ ఎపిక్ ‘వారణాసి’ (Varanasi) . ఇప్పటికే ఈ మూవీపై గ్లోబల్ లెవల్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల ఊహాగానాలకు చిత్ర యూనిట్ చెక్ పెట్టింది. నేడు ఏప్రిల్ 7, 2026 కావడంతో, సరిగ్గా ఏడాది తర్వాత అంటే ఏప్రిల్ 7, 2027న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోందని అధికారికంగా ప్రకటించారు.

కౌంట్‌డౌన్ ప్రారంభం!

సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఎక్స్‌ వేదికగా '365' అనే నంబర్‌ను పోస్ట్ చేయడంతో ఈ మెగా ప్రాజెక్ట్‌ కౌంట్‌డౌన్ అధికారికంగా మొదలైంది. దీనికి కొనసాగింపుగా నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ స్పందిస్తూ.. అంతా సరే కానీ, మాకు ఫస్ట్ సాంగ్ ఎప్పుడు డెలివరీ చేస్తారు? అంటూ సరదాగా కీరవాణిని అడగడం అభిమానుల్లో జోష్ నింపింది. అలాగే, ఈ సినిమా ప్రస్తుతానికి సింగిల్ పార్ట్‌గానే రాబోతోందని, రెండు భాగాలుగా వచ్చే అవకాశం లేదని ఈ అప్‌డేట్ ద్వారా స్పష్టమవుతోందని టాక్ వినిపిస్తోంది..

 

డబుల్ రోల్ లో మహేష్ విశ్వరూపం!

ఈ చిత్రంలో మహేశ్‌ బాబు మునుపెన్నడూ చూడని విధంగా ద్విపాత్రాభినయం (Dual Role) చేయబోతున్నారు. వారణాసి నేపథ్యంలో సాగే ఆధునిక కాలపు పాత్ర 'రుద్ర'గా, అలాగే పౌరాణిక నేపథ్యంలో 'శ్రీరాముడి' పాత్రలో ఆయన కనిపించనున్నారు. శ్రీరాముడిగా మహేశ్‌ కనిపించే 30 నిమిషాల ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అని, రాజమౌళి దీనిని అత్యంత అద్భుతంగా చిత్రీకరించారని సమాచారం.

భారీ తారాగణం.. 

దాదాపు రూ.1400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ఈ మూవీలో ప్రియాంక చోప్రా 'మందాకిని' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఆర్. మాధవన్ 'హనుమంతుడి' పాత్రలో మెరవబోతున్నట్లు టాక్. మరో కీలక పాత్ర  ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారు.

IMAX ఫార్మాట్ లో.. 

వారణాసి చిత్రం కేవలం కథ పరంగానే కాకుండా టెక్నికల్ గానూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 1.43:1 IMAX ఫార్మాట్‌లో చిత్రీకరించిన తొలి భారతీయ చిత్రం ఇదే. దీని కోసం హైదరాబాద్‌లో ఏకంగా 700x400 అడుగుల భారీ సెట్‌ను నిర్మించి వారణాసి ఘాట్లను, రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని పునర్నిర్మించారు. అలాగే అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమాగా కూడా ఇది గుర్తింపు పొందింది. వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి అధికారికంగా రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి మరి.