సుప్రీంకోర్టులో వరవరరావు పిటిషన్ దాఖలు

సుప్రీంకోర్టులో  వరవరరావు పిటిషన్ దాఖలు

భీమా కోరెగావ్ కేసు నిందితుడు వరవరరావు సుప్రీం మెట్లు ఎక్కారు. తనకు ఆరోగ్యం బాగా లేదని, బెయిల్ మంజూరు చేయాలని ముంబాయి హైకోర్టును అభ్యర్థించినా తిరస్కరించిందని పిటిషన్ లో వెల్లడించారు. ఈ మేరకు ముంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంలో వరవరరావు పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సూర్యకాంత్, జెబి పార్దీవాలాతో కూడిన వెకేషన్ బెంచ్ ముందు సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వాదించారు. 82 సంవత్సరాల వయసులో... బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా.. ఇప్పటి వరకు విచారణ జరపడం లేదని సుప్రీంకోర్టుకి ఆయన విన్నవించారు. తాము దాఖలు చేసిన పిటిషన్ ను త్వరగా విచారణకు తీసుకోవాలని సుప్రీంకోర్టును వరవరరావు తరపున న్యాయవాది ఆనంద్ గ్రోవర్ కోరారు. పిటిషన్‌ను జూలై 11న విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.