విరసం నేత వరవరరావుకు బెయిల్

విరసం నేత వరవరరావుకు బెయిల్

హైదరాబాద్‌: విప్లవ రచయితల సంఘం నేత, విప్లవ కవి వరవరరావుకు బెయిల్ లభించింది. లభించింది. భీమా కొరేగావ్‌ కేసుకు సంబంధించి చాలాకాలంగా జైల్లో ఉంటున్న ఆయనకు సోమవారం బొంబే హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఆరునెలల మెడికల్ బెయిల్ పై విడుదలైనా ముంబైలోనే ఉండాలని.. స్పెషల్ ఎన్ఐఏ కోర్టు పరిధిలోనే (ముంబైలోనే) ఉండాలని, అలాగే గత ఎఫ్ఐఆర్‌కు దారి తీసిన కార్యకలాపాలు చేయగూడదని షరతులు విధించింది. వయోభారానికి తోడు కరోనా కూడా సోకి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావు కు బెయిల్ గురించి ఆయన భార్య హేమలత కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్పందించి బెయిల్ ఇచ్చింది. ఆరు నెలల బెయిల్ కాలం ముగిసిన తర్వాత లొంగిపోవడం లేదా బెయిల్ గడువు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా ఇప్పటికే వరవరరావు ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 2018 జనవరి 1న పుణె జిల్లాలోని భీమా కోరెగావ్ లో 200 ఏళ్ల క్రితం జరిగిన  యుద్ధాన్ని స్మరించుకునేందుకు దళితులు చేసిన ప్రయత్నం చివరకు అల్లర్లకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో ఒకరు చనిపోగా కొందరు స్థానికులతోపాటు పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ కేసులో నక్సల్స్ తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2018 నవంబర్ లో వరవరరావు అరెస్టయి జలులో ఉంటున్నారు. ఆయన ఆరోగ్యం గురించి  తీవ్ర ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు, పౌర హక్కుల సంఘాల ప్రతినిధులకు భారీ ఊరట లభించినట్లయింది.

ఇవి కూడా చదవండి

ఇతడు ఇన్నోవేటివ్ రైతుగా​ ఎలా మారాడంటే..

మొక్కకు ఈ బాక్సు పెడితే.. నెలకు రెండు సార్లు నీళ్లు పోస్తే చాలు

చార్మినార్ ను డేంజర్లో పడేస్తున్నరు!

నాటినోళ్ల పేరే.. మొక్కకు పెడుతున్నరు