V6 News

న్యూ ఇయర్ 2023.. ఆలోచింప చేస్తున్న కేక్లు

న్యూ ఇయర్ 2023.. ఆలోచింప చేస్తున్న కేక్లు

నూతన సంవత్సరం వచ్చిదంటే సందడి మాములుగా ఉండదు. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తుంటారు. కుటుంబసభ్యులతో కలిసి టూరిస్ట్ ప్లేస్ కు వెళ్లడమో... ఇంట్లోనే గ్రాండ్ గా పార్టీ చేసుకొనేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 శనివారం రావటం.. వీకెండ్ కూడా కలిసి వస్తోంది. దీంతో ఫుల్‭గా ఎంజాయ్ చేసేందుకు యువత రెడీ అవుతోంది.

అయితే న్యూ ఇయర్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ‘కేక్’ రాత్రి 12 గంటలు కాగానే.. కేక్ లు కట్ చేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు తెలియచేసుకుంటుంటారు. ఈ కేక్ ల కోసం భలే డిమాండ్ ఉంటుంది. కస్టమర్లను అట్రాక్షన్ చేసేందుకు రకరకాలైన కేక్ లు తయారు చేస్తున్నారు. కొంతమంది రంగురంగులు, బొమ్మలతో కేక్ లు తయారు చేస్తుంటే.. మరికొంతమంది వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేక్ లు మార్కెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

డ్రగ్స్ వాడొద్దని... డిజిటల్ ప్లాట్ ఫాం యూజ్ చేసుకోవాలని కోరుతూ కేక్ లను రూపొందించారు. రాష్ట్రపతి ముర్ము చిత్రపటంతో రూపొందించిన కేక్ అందర్నీ ఆకట్టుకొంటోంది. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని కోరుతూ కేక్ ను తయారు చేయడం విశేషం. ఇంకా ఇలాంటి వెరైటీ కేక్ లు అట్రాక్ట్ చేస్తున్నాయి. 

మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. చాలా చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు.  డ్రంకెన్ డ్రైవ్‭లు ఏర్పాటు చేయనున్నారు. తాగి రోడ్లపై అడ్డగోలుగా డ్రైవ్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. 31 రాత్రి నుంచి జనవరి 1న మార్నింగ్ వరకు నెక్లెస్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు... పలు ప్లై ఓవర్లు మూసివేయనున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపినా... ర్యాష్ డ్రైవింగ్, బైక్ లపై స్టంట్స్ చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.