
నిర్మల్ జిల్లా తానూరు మండలంలో నిర్వహించిన ప్రజావేదిక సభలో.. బేల్ తరోడ సర్పంచ్ గోప సాయినాథ్ వినూత్నంగా నిరసన తెలిపాడు. నల్లని చొక్కాపై తెల్లని అక్షరాలతో సమస్యలు రాసుకుని మీటింగ్ కు వచ్చాడు. ఏండ్లు గడిచినా వన సేవకుని భృతి చెల్లించకపోవడం సిగ్గుచేటన్నారు. APO గంగాధర్, T.A జితేందర్, రాజశేఖర్ ల వైఖరి నశించాలంటూ చొక్కాపై రాసుకొచ్చాడు.
కూలీలకు రోజు వారి కూలి పెంచాలని డిమాండ్ చేశారు. పల్లె ప్రగతిలో చేపట్టిన పనులకు బిల్లులు ఇప్పటికీ చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సర్పంచ్ ఇలా సమస్యలను తన చొక్కా పై రాసుకుని రావడంతో.. ప్రజా వేదికకు హాజరైన పలువురు ఆశ్చర్యపోయారు.