Varun Dhawan: నీకు మాత్రమే స్టీల్ ప్లేట్ ఎందుకు..? పిల్లలకు అన్నం పెట్టిన వరుణ్ ధావన్‌పై విమర్శలు

Varun Dhawan: నీకు మాత్రమే స్టీల్ ప్లేట్ ఎందుకు..? పిల్లలకు అన్నం పెట్టిన వరుణ్ ధావన్‌పై విమర్శలు

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కొత్త సినిమా సన్నీ సంస్కారీ కి తులసి కుమారి దసరా పండుగ రోజున రిలీజ్ అయింది. గురువారం  (అక్టోబర్ 2) వరుణ్ కొత్త సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజయింది. ఈ సినిమా రిలీజ్ కు ముందు ఈ బాలీవుడ్ బడా హీరో దసరా పండగ జరుపుకుంటూ కనిపించాడు. ఇందులో భాగంగా అతను రిలీజ్ చేసిన కొన్ని ఫోటోలు ట్రోలింగ్ కు గురవుతున్నాయి. వరుణ్ ధావన్ ఇటీవల తన ఇంట్లో కన్యా పూజ చేస్తున్న ఫోటోలను షేర్ చేశాడు. ఆ ఫోటోల్లో అతను కొంతమంది చిన్నారులతో కలిసి కూర్చుని భోజనం చేస్తూ కనిపించాడు. 

నవరాత్రి వేడుకల్లో భాగమైన ఈ ఆచారంలో చిన్నారులను ఇంటికి ఆహ్వానించి, వారికి ఆహారం పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే చిన్నారులను వారు దుర్గాదేవి రూపాలుగా భావిస్తారు. వరుణ్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలు మాత్రమే సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతున్నాయి. ఈ ఫోటోలో గమనిస్తే పిల్లలకు డిస్పోజబుల్ ప్లేట్లలో ఆహారం వడ్డించి ఉంది. వరుణ్ మాత్రం స్టీల్ ప్లేట్ లో అన్నం తింటున్నాడు. ఈ బేధాన్ని నెటిజన్స్ ఎత్తి చూపారు. ఆ ఫోటోలకు ప్రతిస్పందిస్తూ ఒక యూజర్ "నువ్వు పిల్లలకు ఇచ్చిన ప్లేట్ ని ఎందుకు ఉపయోగించకూడదు?. నీకు మాత్రమే స్టీల్ ప్లేట్ ఎందుకు". అని అడిగాడు.

తన 'సన్నీ సంస్కారి కి తులసి కుమారి' సినిమా విడుదల కానున్నందున వరుణ్ 'సంస్కారి'గా కనిపించడానికి ప్రయత్నిస్తున్నాడని కొందరు ఆరోపించారు. ఈ సినిమా నేడు (అక్టోబర్ 2) థియేటర్లలోకి వచ్చింది. అయితే వరుణ్ రెండు రోజుల క్రితం ఈ బాలీవుడ్ హీరో ఆ ఫోటోలను షేర్ చేశాడు. వరుణ్ ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు. వరుణ్ నటించిన కొత్త సినిమా సన్నీ సంస్కారి కి తులసి కుమారిలో తన నటనకు ప్రశంసలు అందుకుంటున్నాడు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, రోహిత్ సరాఫ్, సన్యా మల్హోత్రా కూడా నటించారు. తన తదుపరి సినిమా బోర్డర్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.