మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. జూన్ 9న హైదరాబాద్ లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. గత ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట సడెన్ గా పెళ్ళి వార్త చెప్పి షాకిచ్చారు. ఇక వరుణ్, లావణ్యల ఎంగేజ్మెంట్ జరిగినప్పటినుండి పెళ్లి ఎక్కడ జరగనుంది? ఎలా జరగనుంది అనే విషయాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది.
అయితే తాజాగా ఈ జంట పెళ్లి గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే వరుణ్ లావణ్యల పెళ్లి ఇటలీలో అదికూడా రాజరిక పద్దతిలో జరుగనుంది. ఇటలీలో జరిగే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇప్పటికే ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్స్ పనిచేస్తున్నట్లు సమాచారం. ఎంతో ఘనంగా జరగనున్న ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిపి కేవలం 50 మంది మాత్రమే హాజరుకానున్నారట. పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఉండనుందని తెలుస్తోంది. ఇక ఇటలీలోనే ఈ పెళ్లి చేసుకోవడానికి కూడా ఓక రీజన్ ఉంది. వరుణ్, లావణ్య మొదటిసారి కలిసి నటించిన మిస్టర్ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది. ఆ షూటింగ్ సమయంలోనే మొదటిసారి ఈ జంట కలుసుకున్నారట. అందుకే అక్కడే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట వరుణ్ లావణ్య.
ఇక వరుణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే యాక్షన్ సినిమా చేస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.