
వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో బలగం జగదీష్ నిర్మించిన చిత్రం ‘కానిస్టేబుల్’. ఆదివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
అతిథిగా హాజరైన రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ‘గతంలో నేను కూడా కొన్ని పోలీస్ పాత్రలు చేశాను. అయితే ఆ పాత్రలు కామెడీ ప్రధానంగా సాగేవి. కానీ ఈ సినిమా కంటెంట్ నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉంది. వరుణ్ సందేశ్ తన పాత్రలో ఒదిగి పోయి ఉంటాడని భావిస్తున్నా’ అని అన్నారు.
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ‘నాకు లవర్ బాయ్‌గా పేరున్నప్పటికీ విభిన్న పాత్రలు సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నా. ఇందులో ఓ సిన్సియర్ కానిస్టేబుల్‌గా కనిపించబోతున్నా’ అని చెప్పాడు. సందేశంతో పాటు కమర్షియల్ అంశాలున్న చిత్రమిది, బాధ్యతలను గుర్తు చేస్తూ హృదయాలను హత్తుకునేలా ఉంటుందని దర్శకుడు ఆర్యన్ సుభాన్ అన్నాడు.
మంచి మెసేజ్‌తో రాబోతున్న చిత్రం అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం అని నిర్మాత జగదీష్ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నటుడు శివారెడ్డి సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.
‘కానిస్టేబుల్’ ట్రైలర్:
వరుస అమ్మాయిల హత్యలతో కానిస్టేబుల్ ట్రైలర్ ఉత్కంఠగా సాగింది. అర్ధరాత్రి అమ్మాయిల మిస్సింగ్, తెల్లారితే చెరువులో లేదా చుట్టూ ఉన్న ముళ్ల పొదల్లో శవాలుగా పడి ఉండే సీన్స్ భయాన్ని కలిగిస్తున్నాయి. ఈ కేసుని ఛేదించడానికి ఒక సాధారణ కానిస్టేబుల్ ఎలా సాల్వ్ చేసాడనేది ఆసక్తి పెంచుతోంది. ట్రైలర్ గ్రిప్పింగ్గా ఉంది. సినిమా కూడా అలానే ఉంటే వరుణ్ సందేశ్కి హిట్ పడటం గ్యారెంటీ!
ఇకపోతే.. వరుణ్ సందేశ్కి హిట్ పడి చాలా కాలం అయింది. ఈ క్రమంలో క్రైమ్, థ్రిల్లర్తో వస్తుండటం వరుణ్ కి బెస్ట్ ఆప్షన్ అని సినీ క్రిటిక్స్ మాట్లాడుకుంటున్నారు. ఎలాంటి హిట్ అందుకోనున్నాడో చూడాలి!