నవంబర్ లో వరుణ్–లావణ్య పెళ్లి

నవంబర్ లో వరుణ్–లావణ్య పెళ్లి

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)తో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. జూన్ 9న మెగా సోదరుడు నాగ బాబు(Nagababu) ఇంట్లో ఈ నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది. 

లేటెస్ట్ గా, వరుణ్,లావణ్యల మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం. ఇందుకోసం నవంబర్‌లో వీరిద్దరి పెళ్ళికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది. త్వరలో  వరుణ్,లావణ్య  డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం యూరప్‌కు వెళ్లే అవకాశం ఉంది. అక్కడే  మ్యారేజ్ఈవెంట్ లొకేషన్ను సెలెక్ట్ చేసే వర్క్ లో ఉంటారని సమాచారం. ఆ తరువాతే వరుణ్,లావణ్య వైవాహిక బంధంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ ఈవెంట్కు టాలీవుడ్,బాలీవుడ్ నుంచి సినీ సెలెబ్రెటీలు అటెండ్ అవుతారని టాక్. 

ఇక అతి కొద్దీ మంది సమక్షంలో జరిగే ఈ వేడుకకు..మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి(Chiranjeevi),సురేఖ(Surekha),పవన్ కళ్యాణ్(Pawan kalyan) రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana),అల్లు అర్జున్(Allu Arjun), స్నేహ(Allu Sneha) అటెండ్ అవుతారని సమాచారం. మిస్టర్ సినిమాతో తెరపై మొదటిసారి జంటగా కనిపించిన ఈ జంట..ఆ తరువాత అంతరిక్షం అనే సినిమాలో కూడా కలిసి నటించారు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో కొంతకాలంగా లవ్ లైఫ్ ను ఎంజాయ్ చేసిన తర్వాత,మ్యారేజ్ చేసుకోబోతున్నారు   వరుణ్, లావణ్య. 

బాలీవుడ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సెలెబ్రేటిస్ చాలానే ఉన్నారు. విరాట్-అనుష్క, దీపికా-రణ్‌వీర్, విక్కీ-కత్రినా, ప్రియాంక-నిక్ ఇక వీరందరి బాటలోనే వరుణ్- లావణ్య చేరబోతున్నారు. –

మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌(Varun tej) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna). ప్రవీణ్‌ సత్తారు(Pravin sattaru) దర్శకత్వంలో వచ్చిన  ఈ మూవీలో సాక్షి వైద్య(Sakshi vaidya) హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఇవాళ (ఆగస్టు 25న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుండి గాండీవధారి అర్జున సినిమాకు నెగిటీవ్ టాక్ వినిపిస్తోంది. సినిమా చాలా స్టైలిష్‌గా ఉన్నా..అంతగా వర్కవుట్‌ కాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా చాలా స్లోగా, బోరింగ్‌గా ఉందంటున్నారు. ఫస్టాఫ్‌లో తల్లి సెంటిమెంట్‌, యాక్షన్‌ సీన్స్‌ బాగానే ఉన్నా ఎక్కడో సోల్ మిస్ అయిందనే అంటున్నారు.