పెళ్ళికి ముందు డేట్ ఎంజాయ్ చేస్తున్న మెగా జంట.. పిక్స్ వైరల్

పెళ్ళికి ముందు డేట్ ఎంజాయ్ చేస్తున్న మెగా జంట.. పిక్స్ వైరల్

మెగా హీరో వరుణ్ తేజ్(Varun tej) ప్రస్తుతం తన ఫియాన్సీ లావణ్య త్రిపాఠి(Lavanya tripathi)తో హాలిడే వెకేషన్ లో ఉన్నారు. కాబోయే భార్యతో షాపింగ్, పార్టీస్ చేస్కుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ ఈ జంట డేట్ కి వెళ్లగా.. ఆసమయంలో తీసుకున్న ఫొటోస్ లావణ్య, వరుణ్ ఇద్దరు తమ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అవికాస్తా క్షణాల్లో వైరల్ గా మారాయి.

ఇవి చూసిన నెటిజన్స్ తమ స్టైల్లో రెస్పాండ్ అవుతున్నారు. "లవ్లీ బర్డ్స్.. ఎంజాయ్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక జూన్ 9 వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠికి ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. గత ఐదు సంవత్సరాల నుండి ప్రేమలో ఉన్న ఈ జంట.. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్ళికి సిద్ధమయ్యారు. ఐతే పెళ్లి ఎప్పుడు జరుగనుంది అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తారు(Praveen sattaru) దర్శకత్వంలో గాండీవదారి అర్జున(Gandeevadhari Arjuna) అనే సినిమా చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా.. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.