Official : వరుణ్ – లావణ్య ఎంగేజ్మెంట్.. కన్ఫర్మ్ చేసిన మెగా టీమ్

Official : వరుణ్ – లావణ్య ఎంగేజ్మెంట్.. కన్ఫర్మ్ చేసిన మెగా టీమ్

మెగా హీరో వరుణ్ తేజ్(Varun tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya trapati)ల ఎంగేజ్మెంట్  ఈ నెల జూన్ 9న జరగనుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే..  ఈ వార్తలపై అటు మెగా ఫ్యామిలీ నుంచి గానీ, లావణ్య తరుపు నుండి గానీ ఎటువంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. దీంతో అభిమానులు కాస్త  కన్ఫ్యూజాన్ కు లోనయ్యారు.

అయితే తాజాగా ఈ వార్తలపై మెగా టీం నుంచి ఒక క్లారిటీ వచ్చింది. రామ్ చరణ్ (Ram Charan) అభిమాన సంఘానికి చెందిన శివ చెర్రీ ఒక నోట్ రిలీజ్ చేశాడు. కంగ్రాట్యులేషన్స్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి అంటూ ఎంగేజ్మెంట్ డేట్ తో ఉన్న ఒక కార్డుని పోస్ట్ చేశాడు. మెగా ఫ్యామిలీతో చాలా సన్నిహితంగా ఉండే శివ చెర్రీ ఈ పోస్ట్ వెయ్యడంతో అభిమానులకు ఒక క్లారిటీ వచ్చింది. 

దీంతో ఫ్యాన్స్ వరుణ్, లావణ్యకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జూన్ 9 శుక్రవారం ఈ నిశ్చితార్ధ వేడుక జరగనుంది. ఇక వరుణ్ లావణ్య జంటగా మిస్టర్ (Mister), అంతరిక్షం(Antharikshan) సినిమాల్లో నటించారు.