
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej)డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ను ఎంచుకుంటూ ఇండస్ట్రీ లో రాణిస్తున్నారు. ప్రయోగాలు చేయడంలో ఈ మెగా హీరో ఎప్పుడు ముందుంటారు.అయితే, రీసెంట్ మూవీస్ కూడా మంచి మెసేజ్ తో పాటు ప్రయోగాత్మకమైన కాన్సెప్ట్ తో వచ్చినవే. కానీ, ఆ సినిమాలకు మౌత్ టాక్ వచ్భిన బాక్సాపీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టలేకపోయాడు.అయినప్పటికీ వరుణ్ తన నుంచి రాబోయే సినిమాలు కూడా తనను తానుగా మలుచుకునే ప్రయోగాత్మకమైన కాన్సెప్ట్స్ తో వస్తుండటం విశేషం.
ప్రస్తుతం వరుణ్ తేజ్ పలాస మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన కరుణకుమార్(Karuna Kumar)డైరెక్షన్ లో మట్కా అనే పీరియాడికల్ జోనర్ లో వస్తున్నాడు.1958-1982 మధ్య యావత్ దేశాన్ని కదిలించిన ఓ యదార్థ సంఘటన ఆధారంగామట్కా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో వరుణ్ తెరకెక్కిస్తున్నరట.రా అండ్ రస్టిక్ గా వచ్చే ఈ సినిమాలో వరుణ్ నాలుగు డిఫరెంట్ షేడ్స్ లో కపిస్తున్నాడట.ఇక వరుణ ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కొత్తసినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే డైరెక్టర్ మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో వరుణ్ ఓ సినిమా లాక్ చేసినట్లు తెలుస్తోంది. రీసెంట్గా వరుణ్కు డైరెక్టర్ గాంధీ చెప్పిన విభిన్నమైన యాక్షన్ కథ చాలా బాగా నచ్చేసిందట.ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వరుణ్ ఒప్పుకున్నట్లు టాక్.ఈ మూవీని ఫస్ట్ ప్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్-యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయని సమాచారం. ఎక్స్ ప్రెస్లో ఎక్కిన మెగా వరుణ్ తేజ్..సేఫ్గా ల్యాండ్ అయ్యేనా! అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ షురూ చేశారు. ఏదేమైనా మేర్లపాక చేసిన చిత్రాల్లో లాజిక్, కామెడీ ఉంటుంది. ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ పక్కా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు
ప్రస్తుతం వరుణ్ చేస్తున్న మట్కా కంప్లీట్ అవ్వగానే మేర్లపాక గాంధీతో కొత్త సినిమాను పట్టాలెక్కించనున్నాడు.త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇక మేర్లపాక గాంధీ సినిమాల విషయానికి వస్తే..ఆయన చివరిగా 2022 లో లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అంతకుముందు వచ్చిన `ఏక్ మినీ కథ`..`మ్యాస్ట్రో` సినిమాల పరిస్థితి అందరికీ తెలిసిందే.ముఖ్యంగా ఆయన హిట్ సినిమాలు చెప్పుకోవాలంటే ఫస్ట్ సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అండ్ ఎక్స్ ప్రెస్ రాజా..ఈ రెండు ఆడియన్స్ ని బాగా నవ్వించాయి. అందరికీ నచ్చేశాయి.
ALSO READ :- బీ అలర్ట్ : ఈ ఎండాకాలం..ఇండియా మండిపోతుంది
కానీ, నానితో తీసిన `కృష్ణార్జున యుద్దం` నుంచి కష్టాలు షురూ అయ్యాయి ఈ డైరెక్టర్ కి.మరి ఇప్పుడు వరుణ్ తీసే చిత్రంతో మ్యాజిక్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే, డైరెక్టర్గా మేర్లపాక గాంధీకి సక్సెస్ ఎంత అవసరమో..ఫెయిల్యూర్స్ తో సతమవుతున్న వరుణ్ కెరీర్ కు అంతే అవసరం.