Varun Tej-Lavanya Tripathi: తండ్రి కాబోతున్న మెగా హీరో వరుణ్‌ తేజ్‌..ఫొటో పోస్ట్ చేస్తూ అధికారిక ప్రకటన

Varun Tej-Lavanya Tripathi: తండ్రి కాబోతున్న మెగా హీరో వరుణ్‌ తేజ్‌..ఫొటో పోస్ట్ చేస్తూ అధికారిక ప్రకటన

మెగా హీరో వరుణ్ తేజ్-హీరోయిన్ లావణ్య త్రిపాఠి గుడ్ న్యూస్ చెప్పారు. తాము తల్లిదండ్రులు కానున్నట్లు అనౌన్స్ చేస్తూ ఓ క్యూట్ ఫొటో షేర్ చేశారు.

నేడు మంగళవారం (2025 మే6న) ఈ విషయాన్ని లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించనున్నాము. కమింగ్‌ సూన్‌’ అని తాము ఇరువురు క్యాప్షన్‌ పెట్టారు. ఈ క్రేజీ గుడ్ న్యూస్తో మెగా కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి.  

అయితే, గత కొన్ని నెలలుగా లావణ్య  త్రిపాఠి ప్రగ్నెంట్ అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలోనే వీరు అధికారికంగా ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్కు, నెటిజన్లకు ఓ క్లారిటీ వచ్చింది. 

దాదాపు ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. వారు మొదటిసారి కలుసుకున్న ప్రదేశం ఇటలీలో వివాహం చేసుకున్నారు. 2023 నవంబర్‌ 1న వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీతో పాటు అతి కొద్దీ మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్ కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.