ఘనంగా వరుణ్-లావణ్య రిసెప్షన్.. తరలి వచ్చిన తారాలోకం

ఘనంగా వరుణ్-లావణ్య రిసెప్షన్.. తరలి వచ్చిన తారాలోకం

మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పెళ్లి రిసెప్షన్ ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ఎన్ క‌న్వెన్ష‌న్ హాల్ లో ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబందించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక నవంబర్ 1న వరుణ్ లావణ్యల పెళ్లి ఇటలీలోని(Italy) టస్కనీ నగరంలో అంగరంగ వైభవంగా జ‌రిగిన విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది. దీనికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఇక వరుణ్ లావణ్య విషయానికి వస్తే.. గత ఆరు సంవత్సరాలుగా ఈ జంట ప్రేమలో ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి నటించిన మొదటి సినిమా మిస్టర్ షూటింగ్ సంయమ ఇటలీలో మొదటిసారి కలుసుకున్నారు. అందుకే వారు కలుసుకున్న మొదటి ప్లేస్ లోనే పెళ్లి చేసుకున్నారు. ఆ షూటింగ్ సమయంలో ఏర్పడ్డ పరిచయమే కొంతకాలానికి స్నేహంగా.. ఆతరువాత ప్రేమగా మారింది. ఇదే విషయాన్నీ ఇరు కుటుంబాలకు చెప్పి ఒప్పించి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. దీంతో ప్రేక్షకులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.   

ALSO READ : రష్మిక ఫేక్ వీడియో వైరల్.. స్పందించిన అమితాబ్.. లీగల్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్