
వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘మట్కా’. మీనాక్షి చౌదరి హీరోయిన్. నోరా ఫతేహి కీలకపాత్ర పోషిస్తోంది. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన వింటేజ్ వైజాగ్ సెట్స్‌లో గత కొద్ది రోజులుగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. యాక్షన్ సీన్స్‌తో పాటు రెట్రో థీమ్ సాంగ్స్ షూటింగ్ జరిగింది.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో కలర్‌ఫుల్ పబ్ సెట్‌లో నోరా ఫతేహీ రెట్రో అవతార్‌లో కనిపించింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో పలువురు గ్రూప్ డ్యాన్సర్స్‌తో గ్రాండ్‌గా ఈ పాటను చిత్రీకరించారు. తాజాగా ఈ లెంగ్తీ షెడ్యూల్ షూట్ పూర్తయింది. ప్రస్తుతం కొత్త షెడ్యూల్ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోందని మేకర్స్ ప్రకటించారు. 1958 నుంచి 1982 మధ్య జరిగే ఈ కథలో వరుణ్ తేజ్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నాడు. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు.