వరుణ్ తేజ్ .. మట్కా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్

వరుణ్ తేజ్ .. మట్కా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్

వరుణ్ తేజ్ హీరోగా ‘పలాస’ ఫేమ్  కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘మట్కా’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్. డబుల్ ఇంపాక్ట్ పేరుతో  ఆదివారం వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో రెండు డిఫరెంట్ గెటప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తున్నాడు వరుణ్. సిగార్ తాగుతూ ఇంటెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మిడిల్ ఏజ్ మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పైన  కనిపిస్తుంటే, కింద ఇమేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యంగ్ లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డాషింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తూ ఇంప్రెస్ చేస్తున్నాడు. 

 అతని డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ వింటేజ్ వైబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెస్మరైజ్ చేస్తున్నాయి. రెండు లుక్స్ రిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  స్టయిలిష్‌‌గా ఉన్నాయి. తన టేబుల్ మీద తుపాకీ, ప్లే కార్డులలో కింగ్ కార్డ్ బ్యాక్ డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్  నాలుగు డిఫరెంట్ క్యారెక్టర్స్ పోషిస్తుండగా,  ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డాగ్ నుంచి ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లార్డ్ వరకు రెండు షేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చూపించారు.  అతను తన టెరిటరీకి రాజుగా ఎదుగుతాడు అని మేకర్స్ తన లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని గురించి పరిచయం చేశారు.  రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో  మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు.  నవీన్ చంద్ర, రవి శంకర్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు.  జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.