వాస్తు సమాచారం : రెండు పోర్షన్లు ఉన్న ఇంటికి టాయిలెట్స్ ఎటువైపు ఉండాలి.. బిల్డింగ్ పైన వాటర్ ట్యాంక్ ఏ దిక్కులో ఉండాలి..?

వాస్తు సమాచారం : రెండు పోర్షన్లు ఉన్న ఇంటికి టాయిలెట్స్ ఎటువైపు ఉండాలి.. బిల్డింగ్ పైన వాటర్ ట్యాంక్ ఏ దిక్కులో ఉండాలి..?

 

టాయిలెట్  ఏ వైపు కట్టుకోవాలి?

ఉన్న ఇంటిని రెండుపోర్టనుగా మార్చాం ఉత్తరం ఫేసింగ్ ఉంది. రెండుపోర్డ్లను ఉన్న ఇంటికి టాయిలెట్ ఏవైపు ఉండాలి?

వేరు వేరు పోర్షన్లు కాబట్టి టాయిలెట్స్ కూడా వేరువేరుగానే ఉండాలి. ఒకవేళ సాధ్యం కాకపోతే రెండింటికి కలిపి ఒక టాయిలెట్ కట్టుకోవచ్చు. ఉన్న ఇంటికి కొంత గ్యాప్ ఇచ్చి కట్టుకోవాలి. వాయువ్యం. ఆగ్నేయం మాత్రమే టాయిలెట్ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.

ఇంటి స్లాబ్ మీద వాటర్ ట్యాంకు కట్టొచ్చా..?

నేను కొత్తిల్లు కట్టుకుంటున్నా, కొద్ది స్థలంలోనే ఇంటి నిర్మాణం చేస్తున్న ఇంటి స్లాబ్ మీద వాటర్ ట్యాంక్ కట్టుకోవచ్చా?

ఇంటి మీద వాటర్ ట్యాంకు కట్టుకోవచ్చు. దాని వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే చాలామంది నైరుతి దిక్కులో బరువు ఉండాలని వాటర్ ట్యాంకులు, ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది అంత మంచిది. కాదు బరువు నైరుతిలోనే ఉంచాలి. కానీ నీళ్లు ఉండకూడదు. అందుకని నార్త్ సెంటర్ లేదా వెస్ట్ సెంటర్లో ట్యాంకు కట్టుకోవాలి..

కాశీనాథుని శ్రీనివాస్
వాస్తు కన్సల్టెంట్ 045-94400 88799