Vastu Tips : ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా.. అయితే నెగెటివ్ ఎనర్జీని ఈ చిట్కాలతో తరిమేయండి..!

Vastu Tips : ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా.. అయితే నెగెటివ్ ఎనర్జీని ఈ చిట్కాలతో తరిమేయండి..!

ప్రతి చిన్న విషయానికి జనాలు వాస్తు పండితులను.. జ్యోతిష్య నిపుణులను సంప్రదిస్తున్నారు. కష్టాలు.. సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం కోపం   పండితుల దగ్గరకు పరిగెడుతున్నారు. వాస్తు శాస్త్రం ఇంట్లో ఉన్న నెగిటివ్​ ఎనర్జీని తొలగించేందుకు కొన్ని వస్తువులు ఉపయోగపడతాయి. జ్యోతిష్యనిపుణులు  తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో ఏ వస్తువులు ఉంటే కష్టాలు.. సమస్యలు తొలగి పాజిటివ్​ ఎనర్జీ వస్తుందో తెలసుకుందాం. . . 

తులసి మొక్క :  

తులసి మొక్కను హిందువులు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. హిందువులు అందరూ ఈ మొక్కకు పూజలు జరుపుతారు.  ఇంట్లో తులసి మొక్కను  ఈశాన్య దిశలో ఉంచడం వలన కష్టాలు తొలగుతాయని పండితులు  చెబుతున్నారు.  తులసి మొక్క నిద్రపోకుండా ( ఎండిపోకుండా) చూసుకోవాలి.  ఈశాన్య దిక్కులో ఈ మొక్కను ప్రతిష్టించి నిత్యం దీపారాధన చేస్తే ఆ ఇంటిలోకి పాజిటివ్​ ఎనర్జీ వస్తుంది.  సమస్యలు పరిష్కారం అయి.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం కొనసాగుతుందని పండితులు చెబుతున్నారు. 

నీళ్ల కుండ:  

నీళ్లను ఉపయోగించే పాత్రలు ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు.   మంచినీళ్ల కుండ ప్రతి ఇంట్లో ఈశాన్యంలో ఉంగాలి.  అది ఎప్పుడూ ఖాళీగాఉండకూడదు.  మంచి నీటికోసం రాగి.. ఇత్తడి.. మట్టి పాత్రలను ఉపయోగించుకోవాలి.  ఈ పాత్రల్లో ఎప్పుడూ నీరు ఉండటం వలన ఇంట్లో ఆనందం.. శాంతి.... శ్రేయస్సు ఉంటుందని అంటున్నారు పండితులు. 

పంచముఖ ఆంజనేయస్వామిపటం:

 ముఖ ద్వారం ( మెయిన్​ డోర్​) దగ్గర  పంచముఖి హనుమంతుని చిత్రపటాన్ని ఉంచడం వల్ల ప్రతికూల శక్తి లభిస్తుంది.  ఇంట్లోకి  ప్రతికూల శక్తి ఎట్టిపరిస్థితిలో రాదు.  ఈ పటాన్ని  దక్షిణ దిశలో ఉంచడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు.  ఇంట్లో పంచముఖి  హనుమంతుడి చిత్రపటం ఉండటం  వల్ల ఆనందం ...  శ్రేయస్సు కలుగుతుంది.

లక్ష్మీ-గణపతి విగ్రహం:  

కొంతమందికి ఎంత సంపాదన ఉన్నా... పైసా కూడా చేతిలో ఉండదు.ఆర్దిక కష్టాలు వెండాడుతూనే ఉంటాయి.  అలాంటి వారు ఇంట్లో లక్ష్మీ దేవి.. గణపతి విగ్రహాలను ఉంచి రోజు పూజించాలి.  దేవుడి మందిరంలో లక్ష్మీదేవి.. గణపతి  విగ్రహాలు.. లేదా చిత్రపటాలు ఉండేలా చూసుకోవాలి.  ప్రతి బుధవారం వినాయకుడికి గరిక.. శుక్రవారం అమ్మవారికి కుంకుమ సమర్పించాలి.  ఇలా చేస్తే డబ్బుకు కొరత ఉండదని వాస్తు.. జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.