
ప్రతిరోజూ ఇంటిని శుభ్రం చేయడానికి చీపురురు ఉపయోగిస్తాము. ఆ తరువాత ఎక్కడ పడితే అక్కడ.. ఎలా పడితే .. అలా పడేస్తాం. ఇలా చేయడం వలన మనకు తెలియకుండానే ఇంట్లో పేదరికం, సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఇంట్లో చీపురు, క్లీనింగ్ మాఫ్ను ఎక్కడ ఉంచాలి ? ఎలా ఉంచాలి? చీపురుకు సంబంధించిన చేయకూడని తప్పులు ఏమిటో తెలుసుకుందాం.
జ్యోతిష్య సిద్దాంతం ప్రకారం చీపురు లక్ష్మీదేవితో సమానం. వాస్తు ప్రకానం దీనిని ఉపయోగించేందుకు కొన్ని నియమాలున్నాయి. వీటిని సక్రమంగా పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో చీపురు ఉంచే విషయంలో కొన్ని ప్రత్యేక విషయాలను తెలుసుకోవాలి.
హిందువులు వాస్తు సిద్దాంతానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. మనం తెలిసో.. తెలియకో చేసే కొన్నితప్పులు ఆర్ధిక నష్టాలను.. ఆర్థిక ఇబ్బందులను కలుగజేస్తాయి. అలాంటి వాటిలో ఇంటిని శుభ్రం చేసే చీపురు.. క్లీనింగ్ మాఫ్.. ఇది ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. వాటిని వాస్తు ప్రకారం ఉంచాల్సిన ప్రదేశాల్లో కాకుండా వేరే చోట ఉంచితే అనేక ఇబ్బందులు వస్తాయి.
చీపురు మరియు క్లీనింగ్ మాఫ్ ఎక్కడ ఉంచాలి
- వాస్తు శాస్త్రం ప్రకారం, చీపురు, క్లీనింగ్ మాఫ్ను ఇంటికి వాయువ్యం లేదా పశ్చిమ దిశలో ఉంచాలి.
- చీపురును దక్షిణ దిశలో మాత్రమే ఉంచండి.
- చీపురును కనిపించే ప్రదేశంలో ఉంచకూడదు. ప్రజల దృష్టికి దూరంగా ఉంచాలి.
- చీపురును నిలబెట్టి కాకుండా పడుకొబెట్టి ఉంచాలి. ఇంట్లో చీపురును నిలబెట్టి ఉంచడం శుభప్రదం కాదు. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.
పొరపాటున కూడా ఈ ప్రదేశాల్లో పెట్టవద్దు..
- చీపురు, తుడుపుకర్రను ఇంట్లో ఈశాన్య లేదా ఆగ్నేయ మూలలో ఎప్పుడూ ఉంచకూడదు.
- చీపురును ఈశాన్య దిశలో ఉంచకూడదు. దీనివల్ల ఇంట్లో డబ్బు కొరత ఏర్పడుతుందని నమ్ముతారు.
- వీటిని పూజా స్థలం దగ్గర వంటగదిలో లేదా పడకగదిలో ఉంచడం మంచిది కాదు.
- ఇంట్లో ఎప్పుడూ చీపురు కాళ్ళ కిందకు రానివ్వకండి. కాళ్ళతో చీపురుని తోక్కకండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది.
పాత చీపురును ఎప్పుడు తీసివేయాలి
- పాత చీపురు ఇంట్లోకి ప్రతికూలతను తెస్తుంది. శనివారం లేదా అమావాస్య నాడు ఇంటి నుంచి దానిని తొలగించాలి. ఇంట్లో నుంచి పాత చీపురును తీసివేయడం వల్ల ఇంట్లోని పేదరికం తొలగిపోయి ఇంట్లో సానుకూలత పెరుగుతుంది.
- సూర్యాస్తమయం తర్వాత ఎప్పుడూ చీపురును ఉపయోగించకూడదు. ఇలా చేయడం వలన ధన నష్టానికి దారితీస్తుంది.
- విరిగిన, పూర్తిగా అరిగిన చీపురును ఉపయోగించవద్దు