ఇల్లు నిర్మించుకొనే విషయంలో కచ్చితంగా వాస్తు సిద్దాంతాన్ని పాటిస్తాం. ఇంటిప్లాన్ విషయంలో కచ్చితంగా వాస్తు పండితుల సలహాలు తీసుకుంటాం. . .. మరి గోడలు ..పిట్టగోడలు కూడా వాస్తు ఉంటుందా.. వాస్తు ప్రకారం ఇంటి పరిసరాలు ఎలా ఉండాలి.. వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ ఇస్తున్న సూచనలను ఒకసారి పరిశీలిద్దాం. . .!
ప్రశ్న :గోడల వల్ల దోషాలు ఉంటాయా?పునాదులు, గోడలు, పిట్టగోడలను శాస్త్రబద్ధంగా నిర్మించాలని, లేదంటే దోషాలు కలుగుతాయని పూజారి చెప్పాడు. గోడల వల్ల గృహానికి ఎలాంటి దోషాలు ఉంటాయి. ఇదెంతవరకు నిజం?
జవాబు: దోషాలు అంటూ ఏమి ఉండవు. వాస్తు ప్రకారం ఎలాగైతే ఇల్లు కట్టుకున్నారో ప్రహరీ, కాంపౌండ్ అలాగే ఉండాలి. ఇంటికి ఆనుకొని ఇతరుల ఇళ్లు కూడా ఉంటాయి. ఆ ప్రభావం కచ్చితంగా ఇంటిపై పడుతుంది. కాబట్టి బేస్మెంట్ ఫర్ ఫెక్ట్ గా ఉండేలా మార్పులు చేసుకోవాలి. సొంతింటికి హద్దులు ఉంటే మంచిది.
ప్రశ్న: పరిసరాలకు వాస్తు ఉంటుందా? వాస్తు బట్టి ఇల్లు కట్టుకున్నా... పరిసరాల వాస్తు కూడా బాగుండాలట. పరిసరాల వాస్తు అంటే.. ఎలా ఉండాలి?
జవాబు: ఇంటికి తగ్గట్టుగానే పరిసరాలు కూడా వాస్తు ప్రకారం ఉంటే బాగుంటుంది. బిల్డింగ్, దాని పరిసరాలు రెక్టాంగిల్ లో ఉండాలి. లేదంటే ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇంట్లోవాళ్లు శారీరక సమస్యలతో ఇబ్బందులు పడతారు. వాస్తుకన్సల్టెంట్ను సంప్రదించాలి. ఇంటికి తగ్గట్టుగా కాంపౌండ్ కొలతలు, ఎత్తులు.. లాంటి వాటిల్లో మార్పులు చేసుకోవాలని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ సూచిస్తున్నారు.
