సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల.ఇల్లు కట్టేటప్పుడు ప్రతి విషయంలో వాస్తు సిద్దాంతాన్ని పాటించాలి. ఇంటి నిర్మాణంలో నైరుతి భాగం పెరిగితే ఎలాసరిచేసుకోవాలి.. సెల్లార్ లేకపోతే నష్టాలొస్తాయా మొదలగు విషయాల గురించి . .. వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారి సలహాలను ఒకసారి తెలుసుకుందాం. . .!
ప్రశ్న: ఇంటికి నైరుతి వైపు స్థలం పెరిగింది అంటున్నారు. దీనివల్లే కొన్ని సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఇదేమైనా దోషమా? ఎలా సరి చేసుకోవచ్చు?
జవాబు: ఇంటికి నైరుతి పెరగడం మంచిది కాదు. ఆ స్థలాన్ని రెక్టాంగిల్ లేదా స్క్వేర్లోకి మార్చుకోవాలి. సరైన దిశలో ఉండేలా చూసుకోవాలి. దీనికి కచ్చితంగా వాస్తు నిపుణులను సంప్రదించి .. సరైన సలహా తీసుకోవాలి. మిగతా దిక్కులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ సూచిస్తున్నారు.
ప్రశ్న: దక్షిణంవైపు రోడ్డుతో, షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాం. దీనికి సెల్లార్ ఉండాలంటున్నారు. అయితే, వాస్తు ప్రకారం సెల్లార్ వీలుపడటం లేదు. దీన్ని ఎలా మార్చుకోవాలి?
జవాబు: రూల్స్ ప్రకారం సెల్లార్ కట్టుకోవాలి. దీనిలో మార్పు సాధ్యం కాదు. కాబట్టి, దానికి అనుగుణంగా నిర్మాణంలో మార్పులుచేసుకోవాలి. వాస్తు నిపుణుల్ని సంప్రదించి, సరైన ప్లాన్ తీసుకుని కట్టుకోవాలని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ సూచిస్తున్నారు.
