ఫేక్ సర్టిఫికెట్ల దందాలో వీసీలు

ఫేక్ సర్టిఫికెట్ల దందాలో వీసీలు
  • భోపాల్ ఎస్ఆర్ కేయూ వీసీ, మాజీ వీసీ అరెస్టు 
  • 44 ఫేక్ సర్టిఫికెట్లు స్వాధీనం 
  • స్టూడెంట్లు కాలేజీకి రాకున్నా, ఎగ్జామ్ రాయకున్నా సర్టిఫికెట్లుజారీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫేక్ సర్టిఫికెట్ల దందాలో వీసీల పాత్ర ఉన్నట్లు తేలింది. భోపాల్ లోని ప్రైవేట్ వర్సిటీ సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీ (ఎస్ఆర్ కేయూ)లో ఏండ్లుగా సాగుతున్న దందా గుట్టురట్టయింది. ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేసిన వీసీ ఎం.ప్రశాంత్‌‌ పిళ్లై, మాజీ వీసీ ఎస్‌‌ఎస్‌‌ కుశ్వలను హైదరాబాద్‌‌ సెంట్రల్ క్రైమ్‌‌ స్టేషన్‌‌( సీసీఎస్‌‌) పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరి వద్ద 44 ఫేక్‌‌ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను హైదరాబాద్ కు తరలించి బుధవారం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ విధించగా చంచల్‌‌గూడ జైలుకు తరలించారు. ఈ స్కామ్ లో ఇప్పటికే ఏడుగురు కన్సల్టెన్సీల నిర్వాహకులు, 19 మంది స్టూడెంట్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను అడిషనల్ సీపీ ఏఆర్ శ్రీనివాస్‌‌ వెల్లడించారు. 


ఫిబ్రవరిలో నాలుగు కేసులు.. 
సిటీ కమిషనరేట్‌‌ పరిధిలోని మలక్‌‌పేట్‌‌, ఆసిఫ్‌‌నగర్‌‌‌‌, ముషీరాబాద్‌‌, చాదర్‌‌‌‌ఘాట్‌‌లో ఫేక్ సర్టిఫికెట్లు సప్లయ్ చేస్తున్న నాలుగు కన్సల్టెన్సీలపై ఫిబ్రవరిలో కేసులు నమోదయ్యాయి. ఈ కన్సల్టెన్సీల్లో ఎస్ఆర్ కేయూకు చెందిన ఫేక్ సర్టిఫికెట్లను పోలీసులు గుర్తించారు. స్టూడెంట్లు కాలేజీకి రాకున్నా, ఎగ్జామ్ రాయకున్నా.. కోర్సు పూర్తి చేసినట్లు వర్సిటీ పేరుతో ఒరిజినల్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు ఆధారాలు సేకరించారు. కేసుల తీవ్రత నేపథ్యంలో దర్యాప్తు కోసం సీపీ సీవీ ఆనంద్‌‌ సిట్‌‌ ఏర్పాటు చేశారు. కన్సల్టెన్సీ నిర్వాహకులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రధాన నిందితుడు ఎస్‌‌ఆర్‌‌‌‌కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేతన్‌‌ సింగ్‌‌ను ఫిబ్రవరి 15న అరెస్ట్ చేశారు. మలక్‌‌పేట్‌‌ సాయి కన్సల్టెన్సీకి చెందిన శ్రీకాంత్‌‌ రెడ్డితో పాటు ఏజెంట్లు శ్రీనాథ్‌‌రెడ్డి, పర్వారి శశిధర్‌‌‌‌, పీకేవీ స్వామి, గుంటి మహేశ్వర రావు, ఆసిఫ్‌‌ అలీ, టి.రవికాంత్‌‌ రెడ్డి, ఉప్పరి రంగరాజులను అరెస్టు చేశారు. ఫేక్ సర్టిఫికెట్లు కొనుగోలు చేసిన 19 మంది స్టూడెంట్లను అదుపులోకి తీసుకున్నారు.


7 రాష్ట్రాల్లో గాలింపు
ఈ దందాలో వర్సిటీకి చెందిన క్లర్క్ నుంచి వీసీల దాకా పాత్ర ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. నిందితుల కోసం 7 స్పెషల్‌‌ టీమ్స్‌‌తో 7 రాష్ట్రాల్లో గాలించారు. రెండు కేసుల్లో నిందితుడు, ఎస్ఆర్ కేయూ ఇన్ చార్జ్ వీసీగా పని చేసిన సునీల్‌‌ కపూర్‌‌‌‌ కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు. ఈ క్రమంలో సర్టిఫికెట్లు జారీ చేసిన మాజీ వీసీ ఎస్‌‌ఎస్‌‌ కుశ్వ, ప్రస్తుత వీసీ ప్రశాంత్‌‌ పిళ్లై కోసం పోలీసులు మూడు నెలలుగా వెతుకుతున్నారు. పక్కా సమాచారంతో మంగళవారం భోపాల్‌‌లో అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ నుంచి 101 ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు గుర్తించారు. నిందితుల వద్ద 13 బీటెక్‌‌, బీఈ, వివిధ డిగ్రీలకు చెందిన మరో 33 ఫేక్ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు.