‘వీర సింహారెడ్డి’ లేటెస్ట్ అప్ డేట్

‘వీర సింహారెడ్డి’ లేటెస్ట్ అప్ డేట్

స్టార్ హీరోలు ఎవరైనా తమ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటారు. వారిలో బాలకృష్ణ ఇంకాస్త ముందుంటారు. తను నటించే సినిమాల్లో ఎక్కువశాతం సంక్రాంతికి విడుదలయ్యేలా ఆయన ప్లాన్ చేస్తుంటారు.ఇప్పటివరకు ఆయన నటించిన పదిహేనుకు పైగా సినిమాలు పొంగల్ కి రిలీజ్ అయ్యాయి. అలా విడుదలైన సినిమాలు ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దీంతో అభిమానులకు కూడా ఇదొక సెంటిమెంట్ గా మారింది. గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న ‘వీర సింహారెడ్డి’ చిత్రాన్ని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. 

అయితే రిలీజ్ డేట్ ను మాత్రం శనివారం అనౌన్స్ చేశారు. జనవరి 12న విడుదల అంటూ బాలయ్య కొత్త పోస్టర్‌‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో సీరియస్ లుక్ లో ఉన్న ఆయన, శత్రువులకు వార్నింగ్ ఇస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రుతి హాసన్ హీరోయిన్ ‌‌గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ ‌‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిటీలో క్లైమాక్స్ షూట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ టీజర్, సాంగ్ సినిమాపై అంచనాలు పెంచాయి. మరోవైపు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, విజయ్ ‘వారసుడు’ కూడా సంక్రాంతి బరిలో ఉన్నాయి. గతంలోనూ పలుమార్లు బాలయ్య, చిరు మధ్య పొంగల్ వార్ జరిగింది. మరి ఈసారి ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.