'నేనే వస్తున్నా' నుంచి "వీరా సూర ధీర రారా" సాంగ్

'నేనే వస్తున్నా' నుంచి "వీరా సూర ధీర రారా" సాంగ్

తమిళ్ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ 'నానే వరువెన్'. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే 'నానే వరువెన్' నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పిస్తుంది. "నేనే వస్తున్నా" పేరుతో ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కానుంది. 

తాజాగా ఈ చిత్రం నుండి "వీరా సూర ధీర రారా" పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ పాటను చంద్రబోస్ రచించారు. "వీరా సూర ధీర రారా.. మతి బెదర.. గతి చెదర.. అడవంతా నీ అధికారం ఔరా" లాంటి లైన్స్ ధనుష్ కి ఎలివేషన్ తో పాటు ఆకట్టుకుంటున్నాయి. చంద్రబోస్ రాసిన ఈ పాటను రాహుల్ నంబియార్ ఆలపించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. 

“కాదల్ కొండేన్”, “పుదుపేట్టై”, “మయక్కం ఎన్న” తర్వాత ధనుష్, సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లుఅర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు.

నటీనటులు:
ధనుష్, ఎల్లి అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, యోగిబాబు మరియు యోగిబాబు 
సాంగ్ క్రెడిట్స్:
రచన: చంద్రబోస్ 
సంగీతం: యువన్ శంకర్ రాజా 
సింగర్: రాహుల్ నంబియార్ 

టెక్నికల్ టీమ్:
కథ: సెల్వరాఘవన్, ధనుష్ 
దర్శకుడు: సెల్వ రాఘవన్ 
బ్యానర్: వి క్రియేషన్స్ 
నిర్మాత: కలై పులి ఎస్ థాను
సమర్పణ: గీతా ఆర్ట్స్ 
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్ 
సంగీతం: యువన్ శంకర్ రాజా 
ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్
PRO: ఏలూరుశ్రీను , మేఘశ్యామ్