పేదల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : వీర్లపల్లి శంకర్  

పేదల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం :  వీర్లపల్లి శంకర్  

షాద్ నగర్,వెలుగు :  బడుగు, బలహీన మైనార్టీ పేదల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. బుధవారం షాద్ నగర్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలను ప్రకటించినట్టుగానే, ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మేనిఫెస్టోను ప్రకటించనున్నట్టు తెలిపారు.

తుక్కుగూడ వద్ద 10 లక్షల మందితో భారీ బహిరంగ సభను కనివిని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. షాద్ నగర్ నుంచి 15 వేల మంది సభకు తరలి వెళ్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు బాబర్ ఖాన్, తిరుపతి రెడ్డి, బాలరాజ్ గౌడ్, కె. చెన్నయ్య, సుదర్శన్ గౌడ్,  నరసింహులు యాదవ్  తదితరులు పాల్గొన్నారు.