- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో.. ప్లాట్‌ఫామ్ నెం.10 దగ్గర పార్కింగ్
- ప్లాట్‌ఫామ్ నెం.1 వద్ద ఉన్న పార్కింగ్ తాత్కాలికంగా మూసివేత
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ నెంబర్–1 వద్ద ప్రయాణికుల కోసం ఉద్దేశించిన పార్కింగ్ సౌకర్యాన్ని తాత్కాలికంగా మూసేశారు. కొత్త పార్కింగ్ సదుపాయాన్ని ప్లాట్ ఫామ్ నెంబర్–10 వద్ద అందుబాటులోకి తీసుకొచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను దాదాపు రూ.714.73 కోట్లతో పునరాభివృద్ధి చేస్తున్నారు.
రద్దీకి అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫోర్ వీలర్ వెహికల్ పార్కింగ్ కు మొదటి రెండు గంటలకు రూ.40, తదుపరి గంటకు రూ.20 వసూలు చేస్తారు. మోటార్ సైకిల్, స్కూటర్, ద్విచక్ర వాహనానికి మొదటి రెండు గంటలకు రూ. 25, తదుపరి గంటకు రూ.10 , సైకిల్ కు మొదటి రెండు గంటలకు రూ. 5, తదుపరి గంటకు రూ. 2 చెల్లించాలి.
